BRS vs CM Revanth: అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి: బీఆర్ఎస్ ట్వీట్

కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.

BRS vs CM Revanth: కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది…మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్ లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ సంచలన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.

We’re now on WhatsAppClick to Join

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న మే లో ఉస్మానియా యూనివర్సిటీలో నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్ లు మూసివేయడానికి విద్యుత్, నీటి కొరతల కారణమని, ఈ విషయాన్నీ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ నోటీసులో ప్రస్తావించారని రేవంత్ అన్నారు. అయితే కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడు తనానికి పరాకాష్ట ఆంటూ రేవంత్ కామెంట్స్ చేశారు . కాగా రేవంత్ కామెంట్స్ పై బీఆర్ఎస్ స్పందించింది. అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ సంచలన ట్వీట్ చేసింది. గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలి అంటూ హాట్ కామెంట్స్ కు పాల్పడింది బీఆర్ఎస్. ఈ క్రమంలో ఫేక్ నోటీసుకి ఒరిజినల్ నోటీసుని జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బీఆర్ఎస్ .

విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మవి నువ్వు.. వెళ్ళి, నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంట్ కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు.. నిన్ను ఉరికిస్తరు. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్.. చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే… అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యూలర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే.. ఎంత అభత్రభావంతో బ్రతుకుతున్నావో అర్థమవుతుంది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దాం అనుకుంటే ప్రజలు నీ లాగుల తొండలు ఇడుస్తరు.. ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

Also Read: Pawan Kalyan : జగన్ కు పదవి గండం ఉందని ఆ మహా కుంభాభిషేకం చేయడం లేదు