తెలంగాణ(Telangana)లో రాజకీయ వేడి రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గమైన కొడంగల్(Kodangal)లో బీఆర్ఎస్ పార్టీ భారీ రైతు దీక్ష(BRS Raithu Deeksha)కు సిద్ధమవుతోంది. ఈ నెల 10న నిర్వహించనున్న ఈ దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొనబోతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయలేదని బీఆర్ఎస్ గత కొద్దీ రోజులుగా ఆరోపిస్తోంది. రుణమాఫీ, ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధర వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టనున్నారు.
Caste Census Survey : కుల గణనతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది – భట్టి
బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ అస్వస్థత కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండగా, పార్టీ భారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భుజాలపై పడింది. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా రైతు సమస్యలపై పోరాటం చేస్తామని, దీనికోసం నిరసనలు, దీక్షలు నిర్వహిస్తామని కేటీఆర్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తున్నారు. దీనికి తగ్గట్లే ప్రభుత్వం ఫై దూకుడు గా వ్యవహారిస్తూ ప్రతి సమస్యపై గళం విప్పుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రారంభించిన రెండు నెలలు పూర్తికాగానే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల విమర్శలు మొదలుపెట్టాయి. రైతులను ఆదుకోవడం లేదని కాంగ్రెస్‌పై బిఆర్ఎస్ ఒత్తిడి తెస్తుండగా, బీజేపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. రానున్న రోజులలో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది. రైతుల సమస్యలను ప్రధాన అంశంగా తీసుకుని బీఆర్ఎస్ దీక్ష చేపడుతున్నా, దీని ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్..వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలనీ డిమాండ్ చేస్తుంది. మరి కొండగల్ దీక్ష కు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా..? లేదా అనేది చూడాలి.