Kavitha Investigation: ముగిసిన కవిత విచారణ, అరెస్ట్ లేకపోవటంతో బీ ఆర్ ఎస్ శ్రేణుల హ్యాపీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను సుదీర్ఘ విచారణ చేసిన ఈడీ రాత్రి 9.15 గంటలకు వదిలింది . సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 10.30 గంటలకు పైగా విచారించిన

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 10:00 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను (Kavitha) సుదీర్ఘ విచారణ చేసిన ఈడీ రాత్రి 9.15 గంటలకు వదిలింది. సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 10.30 గంటలకు పైగా విచారించిన తరువాత వాగ్మూలం తీసుకొని బయటకు పంపారు. అక్కడే ఉన్న బీ ఆర్ ఎస్ శ్రేణులు రెండోసారి ఊపిరి పీల్చు కున్నాయి. ఉదయం రామచంద్ర పిళ్ళై తో కలిపి కవితను విచారించారని తెలుస్తుంది. ఆ తరువాత సిసోడియా, అమిత్ తో కలిపి విచారణ చేసి రికార్డ్ చేసినట్టు సమాచారం. మొత్తంగా రాత పూర్వక ఆధారాలను సేకరించిన తరువాత కవితను బయటకు పంపారు.

సోమవారం రాత్రి 7 గంటల నుంచి ఢిల్లీ ఈడీ ఆఫీస్ ఎదుట హైడ్రామా నడిచింది. డాక్టర్ బృందం రావటంతో కవిత (Kavitha) అరెస్ట్ పై ఉత్కంఠ పెరిగింది. ఉదయం 1045 గంటలకు ఈడీ ఆఫీస్ కు వెళ్లిన ఆమె రాత్రి 9 గంటలు అయినప్పటికీ రాకపోవటం ఉద్వేగాన్ని పెంచింది. దాదాపు 10.30 గంటలు పైగా విచారించారు. సిసోడియా, అమిత్ ఆరోరాలతో కలిపి కవితను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో కవిత లాయర్లు ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. వాళ్ళను రిసెప్షన్ వద్ద ఉన్న విజిటర్స్ రూంకు మాత్రమే పరిమితం చేశారు.

రెండోసారి కూడా కవిత (Kavitha) అరెస్ట్ నుంచి బయట పడ్డారు . అయితే మరోసారి హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీచేసే ఛాన్స్ ఉంది. 24న సుప్రీం కోర్టులో కేసు కూడా విచారణకు రానుంది. ఆ రోజు సుప్రీం ఇచ్చే డైరెక్షన్ అనుగుణం గా విచారణ ఉంటుంది. సౌత్ గ్రూప్ నుంచి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని మంగళవారం విచారించనుంది. ఈ రోజు సుదీర్ఘ విచారణ తరువాత కవిత బయటకు రావటంతో బీ ఆర్ ఎస్ శ్రేణులు ఉపరిపీల్చు కున్నాయి.

బీఆర్ఎస్ మంత్రులు, నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఈడీ ఆఫీస్ గేటు దగ్గరే ఇతర నేతలు అందర్నీ నిలిపివేశారు. కవిత లాయర్ ను కూడా అనుమతించలేదు. కేవలం కవిత మాత్రమే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు.ఈడీ విచారణను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే మార్చి 16వ తేదీన విచారణకు హాజరుకాలేదు. తన న్యాయవాది ద్వారా ఈడీ కోరిన సమాచారాన్ని పంపారు. దీంతో 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ ఆదేశంతోనే కవిత విచారణకు హాజరయ్యారు. వెళ్తారా లేదా అనే సందేహాలను తోసిపుచచి విచారణకు హాజరయ్యారు కవిత.

ఈడీ ఆఫీసులోకి వెళుతున్న సమయంలో.. పిడికిలి బిగించి అభిమానులకు అభివాదం చేశారు. కవిత ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆఫీసులోకి వెళుతున్న సమయంలో భర్త వెన్నంటే ఉండి.. భుజం తట్టి ధైర్యం చెప్పి పంపించారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 20న హాజరవ్వాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ గత వారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తో కలిసి ఆదివారమే ఢిల్లీకి చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ క‌వితను ఇప్పటికే సీబీఐ విచారించింది. ఆ తర్వాత మార్చి 11న ఢిల్లీలో ఈడీ ముందు విచార‌ణ‌కు కవిత హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11 గంట‌ల‌కు వెళ్లిన ఎమ్మెల్సీ క‌విత రాత్రి 8.05 నిమిషాల‌కు తిరిగి వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో ఈడీ మార్చి 16న రావాలని నోటీసు ఇచ్చింది. కానీ ఆ రోజు హాజరవలేదు. దీంతో ఈడీ 20వ తేదీన హాజరవ్వాలని కవితకు మరోసారి నోటీసులు పంపింది. ఆమేరకు సోమవారం కవిత విచారణను ఎదుర్కొన్నారు.

ఈడీ విచారణ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సాగుతోందని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఈ నెల 24న విచారణకు రానుంది. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, ప్రివన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కేసుల్లో గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, విచారణ నుంచి మిన‍హాయింపు కోరుతూ కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఆ రోజు సుప్రీం ఇచ్చే డైరెక్షన్ ఆధారంగా విచారణ సాగనుంది.

రాత్రి 9 గంటల 15 నిమిషాలకు బయటకు వచ్చిన ఆమె ఏ మాత్రం అలిసినట్టు లేరు. హుషారుగా కారులో నుంచి అభివాదం చేస్తూ ఢిల్లీ లోని కేసీఆర్ ఇంటికీ చేరుకున్నారు.

Also Read:  MLC Kavitha : ముగిసిన క‌విత ఈడీ విచార‌ణ‌.. ప‌దిన్న‌ర గంట‌ల పాటు క‌విత‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన ఈడీ