Site icon HashtagU Telugu

BRS : మరో వికెట్ అవుట్..రేపు కాంగ్రెస్ లోకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

Prakash Goud

Prakash Goud

బిఆర్ఎస్ (BRS) పార్టీ లో వరుస వికెట్స్ పడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు..నేను వస్తాను అగు అంటూ వరుసగా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 స్థానాలు గెలిచి ప్రతిపక్ష పార్టీకి పరిమితమైన బిఆర్ఎస్ ను ఆ ప్రతిపక్షం కూడా ఉండకుండా చేయాలనీ కాంగ్రెస్ చూస్తుంది. ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలను నెరవేర్చండి అంటూ ప్రజలు , నిరుద్యోగులు , పెన్షన్ దారులు ఇలా అంత మొత్తుకుంటుంటే..ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా బిఆర్ఎస్ నేతలను చేర్చుకునే పనిలో పడింది. ఇప్పటికే పలువుర్ని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకున్న పార్టీ..ఇప్పుడు మరో ఎమ్మెల్యే ను చేర్చుకోబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (Rajendra Nagar MLA Prakash Goud) బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రేపు రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి పడిపోనుంది. ప్రకాశ్ గౌడ్ గతంలోనే కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వినిపించినప్పటికీ ఎందుకు అది నిజం కాలేదు..ఇప్పుడు మాత్రం పక్క అని తెలుస్తుంది. రేవంత్ కు ప్రకాష్ మంచి స్నేహితుడనే సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ టీడీపీలో కలిసి పని చేశారు. 2009, 2014లో టీడీపీ నుంచి ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఇక బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి..కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరనేది చూస్తే..దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీళ్లతో పాటు ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఇక ఇలా వరుసగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఫై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరిస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇది కొత్తగా మీము చేస్తుంది కాదు..మీరు గతంలో చేసేందే..మీము చేస్తున్నామంటూ సమాధానం ఇస్తుంది.

Read Also : Indian 2 Climax : ఇండియన్ 2 క్లైమాక్స్ సర్ ప్రైజ్ అదేనా..?