రేవంత్ సర్కార్ (Revanth Govt) తీరు పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజలు శాంతియుతంగా ధర్నాలు కూడా చేసుకోనివ్వరా..? ప్రభుత్వం ఏంచేస్తున్న..? ఏ నిర్ణయాలు తీసుకుంటున్న చూస్తూ ఉండిపోవాలా..? ఇదేంటి అని కూడా ప్రశ్నించే హక్కు లేదా..? అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో గిరిజన రైతులపై దాడి చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహబూబాబాద్ (Mahabubabad) ఈరోజు మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నా (Mahadharna) నిర్వహించాలని అనుకున్నారు.
రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహాదర్నా కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నప్పటికీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు రాత్రి బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. అయినప్పటికీ అనుమతి ఇవ్వకపోవడం తో నేతలు, కార్యకర్తలు వెనుదిరిగారు. ఇదే క్రమంలో ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో 144 సెక్షన్ చేపట్టారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?
అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?
అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ?
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ?
ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది ?
ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన..
మొత్తంగా రాక్షస పాలన
ఖబర్దార్ రేవంత్
ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది అంటూ హెచ్చరించారు.
మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గిరిజనుల వ్యతిరేకి అని ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్(Sathyavathi Rathod), తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. గురువారం మహబూబాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గిరిజనుల ఓట్లతో గెలిచి, వారినే అణచివేస్తున్నాడని వారంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనపై ఊరూరా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు-మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి?
అక్కడ గొడవలు ఏం జరగలేదు ?-మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకు?
అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుంది ?
శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది ?
ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది… pic.twitter.com/nCrAPSi05v
— KTR (@KTRBRS) November 21, 2024
Read Also : Chanakya Niti : మౌనం మంచిదే కానీ ఈ విషయాల్లో అది ప్రమాదకరం..!