BRS plan : జ‌గ‌న్ ఫార్ములాతో ఎన్నిక‌ల‌కు కేసీఆర్ సిద్ధం! వ‌చ్చే 6నెల‌లు న‌గ‌దు బ‌దిలీ!!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫార్ములాను మూడోసారి సీఎం కావ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్(BRS plan) ఎంచుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 05:20 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫార్ములాను మూడోసారి సీఎం కావ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్(BRS plan) ఎంచుకున్నారు. ప్ర‌తి నెలా ఏదో ఒక స్కీమ్ కింద నేరుగా ప్ర‌జ‌ల ఖాతాలో డ‌బ్బు వేసే ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్ట‌బోతున్నారు. రాబోవు ఆరు నెల‌ల్లో ప్ర‌తి నెలా ఖాతాల్లో డ‌బ్బు వేయ‌డం ద్వారా ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ ను క్రియేట్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ఈ ప‌ద్ధ‌తి ఈసారి ఓట్ల‌ను రాల్చుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫార్ములాను మూడోసారి సీఎం కావ‌డానికి తెలంగాణ సీఎం కేసీఆర్(BRS plan)

ఓట‌ర్ల బ‌ల‌హీన‌త‌పై మూడోసారి ఫీల్ గుడ్ ప్యాక్ట‌ర్ ను సంధిస్తున్నారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను ఆక‌ర్షించ‌డానికి ప్ర‌త్యేక స్కీమ్ ను ప‌రిచ‌యం చేస్తున్నారు. ప్ర‌తి నెలా ఏదో ఒక స్కీమ్ ద్వారా డ‌బ్బు పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్నారు. డిసెంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌జ‌ల్ని ఫీల్ గుడ్ గా (BRS plan)ఉంచేందుకు ప్ర‌ణాళిక ర‌చించారు. ఆ క్ర‌మంలో ద‌శాబ్ది ఉత్స‌వాలు అంటూ ఫోకస్ పెట్టారు. ఎప్పుడూ లేని విధంగా మంజీర పుష్క‌రాల‌ను చేయించారు. చెరువుల పండుగ అంటూ దావ‌తుల‌తో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు.

ఖాతాల‌కు డబ్బు పంపే స్కీమ్ ల‌ను డిజైన్

రాబోయే కొద్ది నెలల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ర‌హాలో నేరుగా ఖాతాల‌కు డబ్బు పంపే స్కీమ్ ల‌ను డిజైన్ చేస్తున్నారు. ప్రతి నెలా నగదు బదిలీ పథకాలను రూపొందించింది. రైతు బంధు కింద రెండుసార్లు, వెనుకబడిన తరగతులకు 1 లక్ష , పేదలకు 3 లక్షల గృహ నిర్మాణం, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ త‌దిత‌రాల‌తో జూలై నుంచి నవంబర్ వ‌ర‌కు ఉండేలా డిజైన్ చేశార‌ని తెలుస్తోంది.

Also Read : BRS strategy : కేసీఆర్ గురివింద క‌బుర్లు! ఏపీని గేలిచేస్తూ ప‌బ్బం.!!

ఖరీఫ్ సీజన్ కోసం 63 లక్షల మందికి పైగా రైతులకు రైతు బంధు కింద 7,500 కోట్ల పంపిణీతో నగదు బదిలీ పథకాలు ప్రారంభం అయ్యేలా బీఆర్ఎస్ సిద్ధ‌మ‌యింది. జూన్ చివరి వారం నుంచి జూలై చివరి వారం వరకు దశలవారీగా రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. కుల ఆధారిత వృత్తులలో ఉన్న‌ బీసీ లబ్ధిదారులకు యూనిట్లను ప్రారంభించేందుకు పనిముట్లు, ముడిసరుకులను కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆగ‌స్ట్ లో అందజేస్తుంది. ఈ చెక్కులను ఎమ్మెల్యేలు ప్రతి నెలా వారి వారి నియోజకవర్గాల్లో పంపిణీ చేసేలా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్ర‌ణాళిక(BRS plan) ర‌చించారు.

డిసెంబర్‌లో ఎన్నికలకు ముందు లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ

పేదలకు వారి ప్లాట్‌లలో ఇళ్లు నిర్మించుకోవడానికి 3 లక్షల ఆర్థిక సహాయం సెప్టెంబర్, అక్టోబర్ నవంబర్ నెల‌ల్లో వ‌రుస‌గా ల‌క్ష చొప్పున ఖాతాల్లో వేయ‌నున్నారు. మూడు దశల్లో పంపిణీ చేస్తుంది. నవంబర్‌లో రబీ సీజన్‌కు రైతుబంధు పంపిణీ చేయాలని ప్రభుత్వం (BRS plan) యోచిస్తోంది. ఈ సంవత్సరం వివాహాలకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ సహాయం కోసం సమర్పించిన దరఖాస్తులు క్లియర్ చేయ‌నున్నారు. ఈ స్కీమ్ ద్వారా 1,00,016 లబ్దిదారులకు ఆగస్టు నుండి నవంబర్ వరకు దశలవారీగా పంపిణీ చేయ‌బోతున్నారు.

Also read : CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి

డిసెంబర్‌లో ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయ్యేలా బీఆర్ఎస్ చీఫ్ ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఇలా ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ ను క్రియేట్ చేసే బాధ్య‌త‌ను అధికారుల‌కు అప్ప‌గించారు. ఇలా మూడోసారి సీఎం కావ‌డానికి కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారు. మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో ‘హ్యాట్రిక్ విజయం’ సాధించడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. ద‌క్షిణ భార‌త దేశంలో వ‌రుస‌గా మూడోసారి 1980 నుంచి ఏ రాష్ట్రంలోనూ సీఎం ఎంపిక కాలేదు. ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేందుకు కేసీఆర్ ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ ను న‌మ్ముకున్నారు. ఆ క్ర‌మంలో ప్ర‌తినెలా ప్ర‌జ‌ల ఖాతాల్లో ఏదో ఒక రూపంలో డ‌బ్బు ప‌డ‌నుంది.

Also Read : KCR’s Coverts: బీజేపీలో కేసీఆర్ కోవర్ట్ లు..! జాబితా రెడీ..!!