Hyderabad Elections : వచ్చే సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ.. కనీసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయా ఏరియాల వారీగా జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను కేటాయించనున్నట్లు తెలిసింది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలను కూడా ఈ కసరత్తులో భాగస్వాములుగా చేస్తోంది గులాబీదళం. హైడ్రా కూల్చివేతలు, మూసీ నిర్వాసితుల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్ లైన్ (Hyderabad Elections) ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలోనూ పర్యటించి వారిని అటువైపు డ్రైవ్ చేయాలని ప్రణాళిక రెడీ చేస్తోంది. మూసీ సుందరీకరణ పనుల వల్ల నిర్వాసితులుగా మారుతున్న పేదల పక్షం వహిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదంగా కొన్ని డివిజన్లలో గెలవాలనే సంకల్పంతో గులాబీ దళం ఉంది.
Hyderabad Elections : ‘గ్రేటర్’ ఎన్నికలకు బీఆర్ఎస్ ముందస్తు స్కెచ్

Hyderabad Elections