తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ (BRS) పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. పదేళ్ల పాటు తిరుగులేని పార్టీ గా గుర్తింపు తెచ్చుకున్న బిఆర్ఎస్.. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు అటు ఢిల్లీ లోను పార్టీ పేరు కూడా వినపడని పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసి కేవలం 39 స్థానాలు సాధించి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రజలు ఇంత వ్యతిరేకంగా ఉన్నారా..అని ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ షాక్ కు గురయ్యారు. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు..మార్పులు చెయ్యండి..సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చండి..నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి..రైతుల రుణమాఫీ చెయ్యండి అంటూ విశ్లేషకులు, పార్టీ నేతలు మొదటి నుండి చెపుతూ వస్తున్నప్పటికీ కేసీఆర్ (KCR)..ఏమాత్రం లెక్క చేయకుండా మొండిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాడు. ఫలితాల్లో బిఆర్ఎస్ ఓటమి ఖాయమని గ్రహించిన చాలామంది నేతలు..ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) లో చేరి..టికెట్స్ సాధించుకొని విజయం సాధించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఫలితాలు అనంతరం కూడా వరుసగా బిఆర్ఎస్ నేతలు బయటకు రావడం స్టార్ట్ చేసారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. సాధారణ నేతలే కాదు కేసీఆర్ కు అత్యంత దగ్గరి వారు సైతం బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు గెలిచినా కొద్దీ మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇప్పటీకే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా..మరికొంతమంది కూడా చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా వారించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. దీంతో కేంద్రంలోని బీజేపీ కూడా బిఆర్ఎస్ ఎంపీల ఫై దృష్టి సారించింది. బిఆర్ఎస్ లో లోక్‌సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని బీజేపీ నేతలు చెపుతూ వస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కేవలం ఇద్దరు రేణుఖ చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు మాత్రమే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిఆర్ఎస్ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీఫ్ ధన్ ఖడ్ తో సమావేశం అయ్యారు. విలీన అంశంపై చర్చలు జరిపారని అంటున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ కు తెలుసనీ..ఆయన ఆమోదం తోనే బిజెపి లో విలీనం జరుగుతుందని వినికిడి. ఏది ఏమైనప్పయికి వరుస నేతలు పార్టీని వీడడం మాత్రం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నింపుతుంది.
Read Also : Prakash Goud : కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్