Site icon HashtagU Telugu

BRS New Scheme : కాంగ్రెస్ 6 హామీల‌కు చెక్ పెట్టేలా కేసీఆర్ స్కీమ్

KCR New Scheme

Kcr Telangana Screenplay On Karnataka Story

BRS New Scheme :  కాంగ్రెస్ పార్టీ ఆరు ప‌థ‌కాలకు ధీటుగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మరో అస్త్రాన్ని తీయ‌బోతున్నారు. ఆ మేర‌కు మంత్రి కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను పెద్ద ఎత్తున అమ‌లు చేస్తోన్న కేసీఆర్ చాలా కాలంగా మ‌రో ప‌థ‌కం ఉంద‌ని చెబుతున్నారు. దాన్ని ఎప్పుడు బ‌య‌ట‌కు తీయ‌బోతున్నారు? అనేది స‌స్పెన్స్ గా ఉంది. రైతుల‌కు పెన్ష‌న్ ఇచ్చే ప‌థ‌కం ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రైతు బంధు కింద ఏడాదికి ఎక‌రాకు రూ. 10వేలు ఇస్తున్నారు. దానితో పాటు వ‌యోవృద్ధులైన రైతుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల మాదిరిగా పెన్ష‌న్ ఇవ్వాల‌ని యోచిస్తున్నార‌ని వినికిడి. ఆ ప‌థ‌కం ద్వారా రైతాంగాన్ని పెద్ద ఎత్తున ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని బీఆర్ఎస్ అంచ‌నా.

కాంగ్రెస్ పార్టీ ఆరు ప‌థ‌కాలకు ధీటుగా కేసీఆర్ మరో అస్త్రాన్ని ..(BRS New Scheme)

క‌ళ్యాణ్ ల‌క్ష్మీ, షాదీముబార‌క్. కేసీఆర్ కిట్, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధుల‌తో పాటు వివిధ ర‌కాలు ప‌థ‌కాల‌ను కేసీఆర్ స‌ర్కార్ అమలు చేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే నెంబ‌ర్ 1గా తెలంగాణ‌ను నిల‌బెట్టామ‌ని కేసీఆర్ చెబుతున్నారు. అంతేకాదు, ఉద్యోగుల‌కు పీఆర్సీ, డీఏల‌ను స‌వ‌రించ‌బోతున్నారు. ఇలా, అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూ, స‌రికొత్త స్కీమ్ ను త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని కేసీఆర్ చెబుతున్నారు. ఆ స్కీమ్ దెబ్బ‌కు కాంగ్రెస్ ఆరు సూత్రాలు గ‌ల్లంతేనంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో (BRS New Scheme) వినిపిస్తోన్న మాట‌.

ఆరు సూత్రాల‌తో తెలంగాణలో అధికారానికి రావాల‌ని

గ‌తంతో మాదిరిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ట్రాట‌జీ మార్చింది. కేవ‌లం ఆరు సూత్రాల‌తో తెలంగాణలో అధికారానికి రావాల‌ని చూస్తోంది. ఆ ప‌థ‌కాల కంటే మెరుగైన వాటిని అమ‌లు చేయ‌డానికి కేసీఆర్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, పెన్ష‌న్ల‌ను ఇప్ప‌టికే పెద్ద ఎత్తున కేసీఆర్ స‌ర్కార్ ఇస్తోంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల వ‌ల్ల ఏ మాత్రం ఉప‌యోగంలేద‌ని బీఆర్ఎస్ చెబుతోంది. ఢిల్లీ, బెంగుళూరు నుంచి వ‌చ్చిన టూరిస్ట్ ల మాట‌లు విశ్వ‌సించ‌డానికి లేద‌ని చెబుతూ ఆగం కాకుండా బీఆర్ఎస్ ను గెలిపించాల‌ని కోరుతూ (BRS New Scheme) ప్ర‌చారం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన ఆరు సూత్రాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే, వాటి ప్ర‌భావం ఎంతో కొంత ప్ర‌జ‌ల‌పై ఉంటుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : Telangana – BC Survey : వచ్చే నెల నుంచి తెలంగాణలో ‘బీసీ సర్వే’.. ఎందుకంటే ?

“మహాలక్ష్మి` ప‌థ‌కం కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు హామీల‌లో మొదటిది. తెలంగాణలోని మహిళలకు నెలకు ₹ 2,500 ఆర్థిక సహాయం, ₹ 500 చొప్పున గ్యాస్ సిలిండర్లు, రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం క‌ల్పిస్తారు. అయితే, క‌ర్ణాట‌క‌లో ఈ ప‌థ‌కం పూర్తి స్థాయిలో అమ‌లు కావ‌డంలేద‌ని బీఆర్ఎస్ చెబుతోంది.“రైతు భరోసా” పథకం కింద, రైతులకు వార్షిక ఆర్థిక సహాయం ₹15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ₹12,000 మరియు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఉన్న వరికి క్వింటాల్‌కు ₹500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఇప్ప‌టికే బీఆర్ఎస్ రైతుబంధును అమ‌లు చేస్తోంది. అయితే, కౌలు రైతుల‌ను ఆక‌ట్టుకునేలా కాంగ్రెస్ హామీ ఉంది.

Also Read : BRS Twist on Modi : మోడీలేపిన విభ‌జ‌న గాయం!ఎన్నిక‌ల అస్త్రంగా బీఆర్ఎస్!!

“ఇందిరమ్మ” హౌసింగ్ స్కీమ్ రాష్ట్రంలోని అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల కోసం 250 చదరపు గజాల ప్లాట్‌తో పాటు ఇళ్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఒక స్థలం మరియు ₹ 5 లక్షల హామీ ఇస్తుంది. “గృహజ్యోతి” పథకం ప్రతి పేద ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే “చేయుత‌” పథకం కింద పేదలకు ₹10 లక్షల వరకు ఆరోగ్య బీమా మరియు ₹4,000 పింఛను అందజేస్తుంది. “యువ వికాసం” పథకం కింద పేదరికం నేపథ్యం నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి ₹ 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అంతేకాకుండా ప్రతి బ్లాక్‌లో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపన. ఈ హామీల‌ను గ‌మనిస్తే, ప్ర‌స్తుతం బీఆర్ఎస్ అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాల‌ను కొన్ని మార్పులు చేస్తూ, క‌ర్ణాట‌క‌లోని ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. వీటి కంటే మిన్న‌గా ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించే ప‌థ‌కాన్ని కేసీఆర్ త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈసారి ఎన్నిక‌లు ఉచితాల పండ‌గేన‌న్న మాట‌.