Site icon HashtagU Telugu

Kuchukulla Damodar Reddy : బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జంప్..

BRS MLC Kuchukulla Damodar Reddy joining in Congress Party

BRS MLC Kuchukulla Damodar Reddy joining in Congress Party

రాజకీయాల్లో పార్టీ మారడాలు చాలా మామూలు విషయమే. అయితే ఎలక్షన్స్(Elections) దగ్గర పడుతున్న సమయంలో పార్టీ మారడాలు, అధికార పార్టీ నుంచి అధికారం లేని పార్టీకి జంప్ అవ్వడాలు మాత్రం రాజకీయాల్లో కీలకంగా మారతాయి. ప్రస్తుతం తెలంగాణాలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల్లో కర్ణాటక(Karnataka) ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సారి బీఆర్ఎస్ కూడా కర్ణాటక ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తుంది. మరికొన్ని నెలల్లో తెలంగాణాలో(Telangana) కూడా ఎలక్షన్స్ ఉన్నాయి.

పార్టీ పేరు మార్చుకొని బీఆర్ఎస్ దేశం మొత్తం ఎదగాలని చూస్తున్న సమయంలో తెలంగాణ అక్కడక్కడా పార్టీకి తలనొప్పులు ఎదురవుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారు. గతంలో కాంగ్రస్ తరపున సర్పంచ్ గా, MPP గా, ZPTC గా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన దామోదర్ రెడ్డి ఆ తర్వాత TRS లో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్నారు.

గత కొంతకాలంగా నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో దామోదర్ రెడ్డికి గ్యాప్ ఏర్పడింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై దామోదర్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేయడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. ఇక బీఆర్ఎస్ లో ఇమడలేక దామోదర్ రెడ్డి తన పాత పార్టీ కాంగ్రెస్ లోకి వెళదామని ఫిక్స్ అయ్యాడు.

అయితే దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికపై నాగం జనార్ధన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో నాగంను ఒప్పించే బాధ్యతను సీనియర్ నేత జానారెడ్డికి హైకమాండ్ అప్పచెప్పింది. కొన్నిరోజులక్రితం జానారెడ్డి సమక్షంలో ఇద్దరిమధ్య చర్చలు జరిగాయి. ఆల్రెడీ నాగం జనార్దన్ రెడ్డిని హైకమాండ్ ఢిల్లీకి పిలిచి నచ్చజెప్పి, దామోదర్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఉన్న దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు.

 

 

Also Read :   MLA Jeevan Reddy: తెలంగాణ మోడల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన జీవన్ రెడ్డి