Site icon HashtagU Telugu

Gandhi Hospital : బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..హరీష్ రావు ఆగ్రహం

Brs Mlas Arrest

Brs Mlas Arrest

Police Arrested BRS MLAS : హైదరాబాద్ (Hyderabad) గాంధీ హాస్పటల్ (Gandhi Hospital) వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన BRS MLAలు సంజయ్, గోపీనాథ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై అధ్య యనం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు MLAలను అడ్డుకోగా.. సీఎం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.

గాంధీ సహా రాష్ట్రంలోని ప్రభుత్వ హోస్పేటల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాజయ్య నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నిజ నిర్ధారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. నేటి నుంచి నిపుణులైన డాక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించింది. ఇందులో భాగంగా గాంధీ హాస్పటల్ ను పరిశీలించాల్సి ఉన్నది. అయితే కమిటీ పర్యటనను కాంగ్రెస్‌ సర్కార్‌ అడ్డుకున్నది. రాజయ్య సహా కమిటీ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్యే సంజయ్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. అనేక నిర్బంధాల నడుమ గాంధీ హాస్పటల్ కు చేరుకున్న కమిటీ సభ్యులతోపాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నుంచి బయటకు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు.

ఈ అరెస్ట్ లపై హరీష్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ..ఏపీలో ఏమైందో పోలీసులు గుర్తుంచుకోవాలి. అలాంటి పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి. బిఆర్ఎస్ నేతల ఫై , శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించం’ అని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హయాంలో గుండాయిజం పెరిగిపోయిందన్నారు. అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని తెలిపారు. తొమ్మిది నెలల కాలంలో 2 వేల అత్యాచారాలు జరిగాయన్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటి మీదకు వెళ్ళి దాడి చేయటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి పేర్కొన్నారు.

Read Also :  Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురా కుమార్ దిసనాయకే ప్రమాణ స్వీకారం