Site icon HashtagU Telugu

MLA Tellam Venkata Rao: కేసీఆర్ కు బిగ్ షాక్.. తుక్కుగూడ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

MLA Tellam Venkata Rao

MLA Tellam Venkata Rao

MLA Tellam Venkata Rao: తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రోజురోజుకి బలపడుతుంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో కారు జోరు తగ్గుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ తగిలింది. ఫలితంగా ఖమ్మం నుంచి బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఖమ్మం తరుపున బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు. గత కొద్దిరోజులుగా ఆయన కాంగ్రెస్ లోకి వెళతారని వార్తలు వినిపించాయి. ఇన్ని రోజులుగా ఆ వార్తలు అవాస్తమని చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు ఈ రోజు కేసీఆర్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ సభకు హాజరయ్యారు.

We’re now on WhatsAppClick to Join

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు మార్చి 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. అయితే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ తాను ముఖ్యమంత్రిని కలిశానని పేర్కొన్నాడు. కానీ కలిసింది పార్టీలో చేరేందుకేనని ఈ రోజుతో తేటతెల్లం అయింది. తెల్లం వెంకట్‌రావు రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరడానికి బీఆర్ఎస్ ను వీడారు. అయితే కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో తిరిగి గులాబీ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

గత మూడు నెలల్లో చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. మార్చి 30న హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు . అదే విధంగా మార్చి 17న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య పార్టీలో చేరారు. కాగా ఈ రోజు తుక్కుగూడలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ బహిరంగ సభకి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. మల్లీకార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, పలువురు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు హజరయ్యారు.

Also Read: KTR: కేటీఆర్ సార్.. వరంగల్ టికెట్ నాకే ఇవ్వండి!