Site icon HashtagU Telugu

BRS MLA Sunke Ravi Shankar : నన్ను చంపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుంది – బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కీలక వ్యాఖ్యలు

Sunke Ravi Shankar

Sunke Ravi Shankar

చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ (BRS MLA Sunke Ravi Shankar) సంచలన ఆరోపణలు చేశారు. తనకు కాంగ్రెస్ (Congress) నేతల నుండి ప్రాణహాని ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ప్రచారంలో భాగంగా సోమవారం బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సుంకె రవిశంకర్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి దాడిని అడ్డుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక దాడి అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ.. నీలోజిపల్లి గ్రామంలో నాపై దాడికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాపాడారని..ఇప్పుడు మరోసారి దాడికి దిగారని అన్నారు. తన గెలుపును తట్టుకోలేక కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం తనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని రవి శంకర్ ఆరోపించారు. గతంలో రెండుసార్లు దాడి చేసారని..కాంగ్రెస్ నుండి తనకు ప్రాణ హాని ఉందని తనను రక్షించాలని పోలీసులను కోరారు.

Read Also : Chandrababu : చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు – సజ్జల