BRS MLA Kale Yadaiah : సీఎం రేవంత్ తో ఎమ్మెల్యే కాలె భేటీ..బిఆర్ఎస్ లో మరో వికెట్ పడబోతుందా..?

  • Written By:
  • Updated On - March 5, 2024 / 04:25 PM IST

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బిఆర్ఎస్ పార్టీ (BRS) కీలక నేతలంతా వరుసపెట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు..సీఎం రేవంత్ (CM Revanth) ను కలిసి కాంగ్రెస్ లో చేరగా..తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య (BRS MLA Kale Yadaiah ).. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం తో బిఆర్ఎస్ పార్టీ లో మరో వికెట్ పడబోతుందా..? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్..మూడోసారి కూడా భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. కానీ ప్రజలు మాత్రం మార్పు కావాలని గట్టిగా ఫిక్స్ అయ్యి..కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ముందే తెలుసుకున్న బిఆర్ఎస్ నేతలు..ఎన్నికలకు ముందే పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి టికెట్స్ దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు పదవులు చేపట్టి కీలక హోదాల్లో కొనసాగుతున్నారు. ఇక బిఆర్ఎస్ లో గెలిచినా కొద్దీ మంది కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అధికారంలో పార్టీ లో ఉంటె ఏముంటుందని భావించి..అధికార పార్టీ లోకి జంప్ అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మంగళవారం చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. ఆయన వెెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నేతలు ఉన్నారు. దాదాపు అరంగట పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే కాలె యాదయ్య సీఎంతో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్న క్రమంలో కాలె యాదయ్య కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు.

Read Also : ‘Born In The Air’ : విమానంలో గర్భిణికి డెలివరీ చేసిన పైలట్..