Gangula Kamalakar: దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి, మంత్రి గంగులకు తప్పిన పడవ ప్రమాదం!

కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగులకు తృటిలో ప్రమాదం తప్పింది.

Published By: HashtagU Telugu Desk
Gangula1

Gangula1

కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగులకు తృటిలో ప్రమాదం తప్పింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తాజాగా చెరువుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్‌నగర్ ఊర చెరువు వద్ద జరిగిన చెరువుల పండుగలో గంగుల పాల్గొన్నారు. ఈ సమయంలో నాటు పడవ ఎక్కాలని గంగులను బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. దీంతో గంగుల నాటు పడవ ఎక్కేందుకు ఆసక్తి చూపారు. అయితే గంగుల ఎక్కుతుండగా నాటు పడవ ఒకవైపునకు ఒరిగిపోయి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో గంగుల పట్టు కోల్పోయి నీళ్లల్లో పడ్డారు. వెంటనే అప్రమత్తమైన గంగుల సెక్యూరిటీ సిబ్బంది.. నీళ్లల్లోకి దిగి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

దీంతో ప్రమాదం నుంచి తేరుకొని కాసేపటికి మిగతా కార్యక్రమాల్లో గుంగుల పాల్గొన్నారు. గంగుల సురక్షితంగా బయటపడటంతో.. అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 21 రోజుల పాటు అవతరణ ఉత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.

Also Read: Shocking: బిహార్ లో దారుణం, ప్రియుడి మ‌ర్మాంగాన్ని కోసిన ప్రియురాలు

  Last Updated: 09 Jun 2023, 02:50 PM IST