Minister KTR: బీఆర్ఎస్ అంటే భారత “రైతు” సమితి

రైతురుణ మాఫీ ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై విశేష ఆదరణ లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Minister KTR: రైతురుణ మాఫీ ప్రకటిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై విశేష ఆదరణ లభిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజువైందని తెలిపారు. జై కిసాన్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి కేవలం నినాదం మాత్రమే కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విధానం అని చెప్పారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా. రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు.రైతురుణమాఫీ ముఖ్యమంత్రి కేసిఆర్ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానమని, ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ.. ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే పండుగగా అభివర్ణించారు మంత్రి కేటీఆర్.

Also Read: Spinach Benefits: పాలకూరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేమిటో తెలుసుకోండి