BRS Master Strategy : కాంగ్రెస్ ఓట్ల‌పై జ‌న‌సేన‌, బీఎస్పీ, ఎంఐఎం గురి

BRS Master Strategy : కాంగ్రెస్ పార్టీకి 52 స్థానాల్లో జ‌ల‌క్ ఇచ్చే మాస్ట‌ర్ ప్లాన్ రెడీ అయింది. బీఎస్పీ, జ‌న‌సేన రంగంలోకి దిగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 12:54 PM IST

BRS Master Strategy :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 52 స్థానాల్లో జ‌ల‌క్ ఇచ్చే మాస్ట‌ర్ ప్లాన్ రెడీ అయింది. ఎంపిక చేసిన స్థానాల్లో బీఎస్పీ, జ‌న‌సేన రంగంలోకి దిగుతున్నాయి. ఆయా స్థానాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌డానికి రంగం సిద్ద‌మైయింది. సిర్పూర్ న నుంచి బీఎస్పీ తెలుగు రాష్ట్రాల క‌న్వీన‌ర్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పోటీకి దిగుతున్నారు. ఇక జ‌న‌సేన పార్టీ తెలంగాణ‌లోని 32 చోట్ల పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఏపీ సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను జ‌న‌సేన ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

జ‌న‌సేన పార్టీ తెలంగాణ‌లోని 32 చోట్ల పోటీ (BRS Master Strategy)

ఇటీవ‌ల ప‌లు సినిమా వేదిక‌ల‌పై ప‌వ‌న్ మీద మంత్రి కేటీఆర్ ప్రేమ కురిపించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన హీరోగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయ‌న న‌టించిన సినిమాల‌కు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునే వెసుల‌బాటు తెలంగాణ ప్ర‌భుత్వం క‌ల్పించింది. బెనిఫిట్ షోల‌ను వేసుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, బీఆర్ఎస్ అడుగుజాడ‌ల్లో జ‌న‌సేన (BRS Master Strategy) న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ, టీడీపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన తెలంగాణ‌లో మాత్రం ఒంట‌రిగా ఉంది. బీజేపీ తొలి నుంచి ఆ పార్టీని దూరంగా పెట్టింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ ను అప్ప‌టి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దూరంగా పెట్టారు. ఉప ఎన్నిక‌లు జ‌రిగిన హుజూర్ న‌గ‌ర్, హుజూరాబాద్, నాగార్జున సాగ‌ర్ ప్ర‌చారంలోనూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను రానివ్వ‌లేదు. ఆ త‌రువాత బీఆర్ఎస్ పార్టీతో ప‌వ‌న్ చేతులు క‌లిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ అడ‌గ‌కుండానే జ‌న‌సేన మ‌ద్ధ‌తు (BRS Master Strategy) ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే.

బీఎస్పీ 20 చోట్ల రంగంలోకి

ఏపీ సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న 32 చోట్ల జ‌న‌సేన పోటీకి దిగింది. అంటే, బీఆర్ఎస్ పార్టీ తెర‌వెనుక ఉంద‌ని ఎవ‌రైనా భావిస్తారు. ఇటీవ‌ల మంత్రి కేటీఆర్, ప‌వ‌న్ క‌ల్యాణ్ స్నేహాన్ని గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి 32 చోట్ల జ‌న‌సైన్యం ప‌నిచేస్తుంద‌ని బోధ‌ప‌డుతోంది. ఇక ఆర్ ఎస్ ప‌వీణ్ కుమార్ తెలంగాణ వ్యాప్తంగా స్వేరోల‌ను బ‌లోపేతం చేశారు. క్షేత్ర‌స్థాయిలో స్వేరోలు బ‌లంగా ప‌నిచేస్తున్నారు. ఎక్కువ‌గా ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల్లోకి చొచ్చుకు వెళ్లారు. ఆ ఓటు బ్యాంకు మోజార్టీ కాంగ్రెస్ కు ఉండేది. ఇప్పుడు దాన్ని చీల్చుకోవ‌డానికి బీఎస్పీ 20 చోట్ల రంగంలోకి దిగింది. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి (BRS Master Strategy) కూడా ఒంటరిగా పోటీ చేయాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ బీఎస్పీ ఒంట‌రిగా వెళుతోంది.అదే త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ ఒంటరి పోటీకి సిద్ధ‌ప‌డుతూ 20 చోట్ల అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది.

Also Read : Job Opportunities: హన్మకొండలో ఐటీ పార్క్.. 500 మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు

మొత్తంగా 40 నుంచి 50 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏపీ సెటిల‌ర్ల ప్ర‌భావం ఉంటుంద‌ని స‌ర్వేల సారాంశం. అలాగే, 30 చోట్ల ఎస్సీల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, జ‌న‌సేన రంగంలోకి దిగాయి. ఇక 42 చోట్ల ఎంఐఎం కూడా పోటీకి దిగ‌నుంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీకి అస‌రుద్దీన్ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ కు ప‌డే మైనార్టీ ఓట్ల‌ను చీల్చుకోవ‌డానికి ఎంపిక చేసిన స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలిపేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇలా, కాంగ్రెస్ ఓట్ల‌ను చీల్చ‌డానికి అన్ని ర‌కాలు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ కాంగ్రెస్ కు అధికారం ఏమిటి? అనేది ప్ర‌శ్నార్థ‌కం కానుంది.

Also Read : AP : పవన్ కళ్యాణ్ కు పోలీసుల నోటీసులు