Site icon HashtagU Telugu

Banakacharla Project : నీటిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న బిఆర్ఎస్ – సీఎం రేవంత్

Complete city beautification works quickly : CM Revanth Reddy

Complete city beautification works quickly : CM Revanth Reddy

ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రితో సమావేశమైన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) పేరుతో BRS పార్టీ నీటిని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలని చూస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. “విభజన చట్టం ప్రకారం కేవలం పోలవరం ప్రాజెక్టుకే అనుమతి ఉంది. కానీ బనకచర్ల ప్రాజెక్టును పోలవరానికి అనుబంధంగా చూపించేందుకు BRS ప్రయత్నిస్తోంది” అని పేర్కొన్నారు.

Kannappa : ప్రభాస్ ను నమ్ముకున్న కన్నప్ప

ఈ ప్రాజెక్టుకు బీజం BRS హయాంలోనే వేసినదని రేవంత్ ఆరోపించారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కాలంలోనే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించబడినట్లు ఆయన గుర్తుచేశారు. “ఇప్పుడు గోదావరి నీటి వినియోగంపై కొత్తగా వివాదాలు సృష్టిస్తూ, ఆ నీటిని ఆధారంగా చేసుకుని మళ్లీ రాజకీయంగా బతికే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తోంది. కానీ ఆ పార్టీకి ప్రజలు ఇప్పటికే తుది వీడ్కోలు చెప్పారు” అని రేవంత్ విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్‌ గాంధీ

రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు అనేవి ప్రాధాన్యతా అంశాలన్న సీఎం రేవంత్, ఈ అంశాల్లో రాజకీయ లబ్ధి కోసమే వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి అవమానం అని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో పారదర్శకత అవసరమని, కేంద్రంతో సంపూర్ణ సమన్వయంతో ముందుకెళతామని ఆయన స్పష్టం చేశారు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం హక్కుల కోసం పోరాడుతామని, కానీ అవి కొందరి రాజకీయ లాభాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసమే ఉండాలన్నది సీఎం రేవంత్ స్పష్టమైన సందేశం ఇచ్చారు.