తెలంగాణ(Telangana)లో విద్యుత్తు సమస్య(Electricity Problem)పై రాజకీయ విమర్శలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. విద్యుత్తు విషయమై బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో కీలక విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, అవి పూర్తి చేయడంలో కాంగ్రెస్ పాత్ర ఉన్నదన్నారు.
LiFe Style : అర్ధరాత్రి దాటాక జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మీ పని అయిపోయినట్లే!
పదేళ్ల పాటు పాలనలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్‌నైనా ఉత్పత్తి చేసిందా? అని భట్టి ప్రశ్నించారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా జరగలేదని ఆయన విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన 24 గంటల విద్యుత్‌పై తప్పుడు ప్రచారం చేయడం మినహా, బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పుకోదగ్గ ఏ పని లేదన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, పరిశ్రమలకు, సాధారణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటోందని భట్టి తెలిపారు. తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ (BRS) మాయ మాటలకు బలయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేయడం కోసం కొత్త ప్రాజెక్టులు, పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు.