రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (telangana assembly election polling) జరగబోతుంది. ఇప్పటికే ప్రచారం పూర్తి అయ్యింది..ఈసీ (EC) సైతం పోలింగ్ కు సంబదించిన ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇదే క్రమంలో బరిలో నిల్చున్న అభ్యర్థులు నోటుతో ఓటు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఓటుకు వెయ్యి నుండి రెండు వేలు పంచుతూ ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న వారికీ సైతం ఫోన్లు చేసి ప్రయాణ ఖర్చులతో పాటు ఓటు వేసినందుకు రెండు వేలు ఇస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా వికారాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ (BRS) శ్రేణులు దేవుడిపై ప్రమాణం చేయించుకొని డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో దేవుడి పటాలపై ప్రమాణం చేయించుకొని ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. ఇదే విషయాన్నీ గ్రామస్థులు చెప్పుకొచ్చారు. ‘దేవుడి తోడు ..కారు గుర్తుకే ఓటువేస్తాం’ అని బలవంతంగా చెప్పించినట్లు వీడియో లో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు చాల ప్రాంతాల్లో కూడా ఇలాగే బిఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలా దేవుడి ఫై ప్రమాణం చేయించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై ఎన్నికల సంఘం రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.
Read Also : Rahul Dravid: బీసీసీఐ మళ్లీ రాహుల్ ద్రవిడ్‌కు ప్రధాన కోచ్ పదవిని ఆఫర్ చేసిందా..?