Harish Rao: గ్రూప్ -1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. ఇంకెప్పుడు టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని ఆంక్షలు విధించింది. టీజీపీఎస్సీ నిర్ణయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తప్పుబట్టారు.
Also Read: TGPSC : బీఆర్‌ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు
రాకేశ్ రెడ్డిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు విమర్శించారు. గ్రూప్-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా..? అంటూ ప్రశ్నించారు. ఆరోపణలు వస్తే వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి కేసులు పెడతారా? అని నిలదీశారు. ప్రశ్నించిన వారిపట్ల నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గం. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని హరీశ్ అన్నారు.
మరోవైపు టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులపై రాకేశ్ రెడ్డి స్పందించారు. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తేనే పరువుపోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఇదే టీఎస్‌పీఎస్సీపై రోడ్డెక్కి మరీ ఎన్నో విమర్శలు చేశారని గుర్తుచేశారు. మరి అప్పుడెందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన నిలదీశారు.
Also Read: China: 50కిలోల కంటే తక్కువ బరువుంటే బయటకు రావొద్దు.. నిర్మానుష్యంగా మారిన బీజింగ్