BRS : బీజేపీ ప్ర‌త్యామ్నాయంపై నార్త్-సౌత్‌,KCR అయోమ‌యం!

బీజేపీ ప్ర‌త్యామ్నాయం(BRS) మూల‌న‌ప‌డుతోంది. ఏప్రిల్ 27న పార్టీల‌ను ఒకే

  • Written By:
  • Updated On - March 21, 2023 / 02:32 PM IST

నార్త్ , సౌత్ ఎత్తుగ‌డ‌ల మ‌ధ్య బీజేపీ ప్ర‌త్యామ్నాయం(BRS) మూల‌న‌ప‌డుతోంది. ఏప్రిల్ 27న దేశంలోని ప్రాంతీయ పార్టీల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకురావ‌డానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR)ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ రోజు హైద‌రాబాద్ లో జ‌రిగే పార్టీ ప్లీన‌రీ వేదిక ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షా ద్వ‌యానికి బ‌ల‌మైన సంకేతం ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇప్ప‌టికే జాతీయ ఈక్వేష‌న్ల‌లో ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేని కేసీఆర్ ఈసారి జ‌రిగే ప్లీన‌రీ నుంచి పూర్తి స్థాయి శంఖారావం బీజేపీ మీద పూరించాల‌ని దూకుడు పెంచారు.

నార్త్ , సౌత్ ఎత్తుగ‌డ‌ల మ‌ధ్య బీజేపీ ప్ర‌త్యామ్నాయం(BRS)

ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన జాతీయ స‌మావేశాల్లో బీజేపీ ప్ర‌త్యామ్నాయ వేదిక కావాల‌ని స‌మాజ్ వాదీ పార్టీ నిర్ణ‌యించింది. ఆ విష‌యాన్ని బెంగాల్ టైగ‌ర్ మ‌మ‌త తో కూడా అఖిలేష్ యాద‌వ్ పంచుకున్నారు. జ‌న‌తాప‌రివార్ అంతా ఒక‌టి కావడానికి దూకుడు పెంచింది. అందుకే, అఖిలేష్‌, మ‌మ‌త ఏక‌తాటి మీద‌కు వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీలేని బీజేపీ ప్ర‌త్యామ్నాయం కావాల‌ని అఖిలేష్‌, మ‌మ‌త ఎజెండా. ఇదే ఎజెండాను దేశ వ్యాప్తంగా కేసీఆర్(KCR) కూడా వినిపిస్తున్నారు. కానీ, ఐక్యంగా అంద‌రూ ముందుకు రాలేక‌పోతున్నారు. ఎవ‌రికి వారే ప్ర‌ధాని అభ్యర్థి ఎవ‌రు? అనే ప్ర‌శ్న వ‌ద్ద ఆగిపోతున్నారు. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌రు? అనే దానిపై నిర్ణ‌యం తీసుకుందామ‌న్న ప్రాథ‌మిక ఒప్పందం ప్ర‌కారం ప్రాంతీయ పార్టీలు ఒక వేదిక‌పైకి రాబోతున్నాయి. అందుకే, కేసీఆర్ పెట్టే ప్లీన‌రీ(BRS) నాంది ప‌ల‌క‌నుంది.

ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్  ప్లీనరీ

ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో జరగనున్న బీఆర్‌ఎస్(BRS) ప్లీనరీని ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కు మారిన త‌రువాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అందుకోసం తొలి తొలి ప్లీనరీ నుంచి జాతీయ ట‌చ్ బ‌లంగా ఇవ్వాల‌ని కేసీఆర్ (KCR) ప్లా న్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్లీనరీ ఏప్రిల్ 27న జరగనుండగా, కొత్త సచివాలయ ప్రారంభోత్సవం ఏప్రిల్ 30న జరగనుంది.

ప్రాంతీయ పార్టీల నేతలను ప్లీనరీకి ఆహ్వానించాలని(KCR)

జనవరి 24న డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జేడీయూ అధినేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీ(యూ) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్‌లను సీఎం (KCR) ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించి, వెంటనే పరేడ్ గ్రౌండ్స్‌లో బీహార్ సీఎం నితీష్ తో స‌హా ప్రాంతీయ పార్టీల‌ నేతలతో బహిరంగ సభ ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ, ఫిబ్రవరి 11న, హైదరాబాద్-ఆర్‌ఆర్-మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ స్థానిక నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉంద‌ని సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా ప‌డింది. మార్చి 16 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఏప్రిల్ 30న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చేస్తామని ప్రకటించిన సీఎం ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

Also Read : BRS : హిందూ సెంటిమెంట్ , ఎన్నిక‌ల‌కు కేసీఆర్ ఎత్తుగ‌డ‌

ఇప్పుడు కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి బదులుగా ప్రాంతీయ పార్టీల నేతలను బీఆర్ఎస్(BRS) ప్లీనరీకి ఆహ్వానించాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్ యాదవ్ మార్చి 17న కోల్‌కతాలో మమతా బెనర్జీని కలుసుకుని, 2024 లోక్‌సభ ఎన్నికలలోపు కాంగ్రెస్ మైనస్‌తో కొత్త ఫ్రంట్ లేదా కూటమి ఏర్పడుతుందని మీడియాతో చెప్పడంతో కేసీఆర్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ప్లీన‌రీ వేదిక‌పైన‌ కేసీఆర్  దూకుడు

గత డిసెంబర్‌లో న్యూఢిల్లీలో జరిగిన బీఆర్‌ఎస్ (BRS) జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి అఖిలేష్ హాజరయ్యారు . జనవరిలో ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ మొదటి బహిరంగ సభలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్‌తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్‌తో కలిసి పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా కూడా కేసీఆర్ తో క‌లిసి ఉన్నారు. కాంగ్రెస్ లేని కూట‌మి కోసం మ‌మ‌త‌, అఖిలేష్ ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, అదే ఫార్ములాతో ఏప్రిల్ 27వ తేదీన ప్లీన‌రీ వేదిక‌పైన‌ కేసీఆర్(KCR) దూకుడు పెంచ‌నున్నారు.

Also Read : BRS : తెలంగాణ ఏర్పాటు న‌గ్న‌స‌త్యాలు!BRS చీఫ్ నోట ఇలా.!!