BRS Kavitha :ఆర్థిక పాపం పండింది!ED బేడీల వేళ నారీభేరీ!

హ‌స్తిన లాబీయింగ్ ద్వారా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారానికి

  • Written By:
  • Updated On - March 8, 2023 / 01:59 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారానికి రాజ‌కీయ రంగు పుల‌మ‌డానికి బీఆర్ఎస్ మాస్ట‌ర్ (BRS Kavitha) స్కెచ్ వేసింది. హ‌స్తిన లాబీయింగ్ ద్వారా ఈడీ, సీబీఐ నోటీసుల(ED Notce) గురించి ముందే తెలుసుకున్న కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ముందస్తుగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చార‌ని బీజేపీ చెబుతోంది. ఆమె అరెస్ట్ గురించి గ‌త నాలుగు నెల‌లుగా ప్ర‌తిరోజూ ఏదో ఒక సంద‌ర్భంలో క‌మ‌ల‌నాథులు ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు. తొలి విచార‌ణ క‌విత‌కు ఇష్ట‌మొచ్చిన ప్లేస్, టైమ్ లో సీబీఐ విచార‌ణ చేసింది. ఆ సంద‌ర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య న‌డుస్తోన్న ఇచ్చిపుచ్చుకునే రాజ‌కీయ కోణాన్ని కాంగ్రెస్ తెర మీద‌కు తీసుకొచ్చింది. అయితే, ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మ‌నీష్ సిసోడియా అరెస్ట్ త‌రువాత సీన్ మారింది.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ్య‌వ‌హారానికి రాజ‌కీయ రంగు (BRS Kavitha)

ఆ రోజు నుంచి ఏ రోజైనా క‌విత అరెస్ట్ (BRS Kavitha) అవుతార‌ని ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అంశాన్ని వ్యూహాత్మ‌కంగా క‌విత నెత్తిన పెట్టుకున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత మ‌హిళ‌లకు ప్ర‌ధాన్యం నేతిబీర‌కాయ‌లో నెయ్యి మాదిరిగా ఇచ్చార‌ని అంద‌రికీ తెలిసిందే. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన 2014 నుంచి 2018 వ‌ర‌కు ఒక్క మ‌హిళ కూడా లేకుండా మంత్రివ‌ర్గాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ త‌రువాత ప‌లు విమ‌ర్శ‌ల న‌డుమ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన స‌బిత‌తో పాటు ఒక‌రిద్ద‌రికి రెండోసారి సీఎం అయిన రెండేళ్ల‌కు మంత్రి ప‌ద‌వుల‌ను ఇచ్చారు. ఎంపీగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేయ‌డానికి కూడా టీఆర్ఎస్ పార్టీ మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రిగింది. ఒక్క క‌విత‌కు మాత్ర‌మే న్యాయం జ‌రిగింద‌ని స‌గ‌టు తెలంగాణ పౌరుడ్ని ఎవ‌ర్నీ క‌దిలించిన‌ప్ప‌టికీ చెబుతారు.

Also Read : Kavitha Reaction: తెలంగాణ తల వంచదు.. లిక్కర్ స్కామ్ పై కవిత రియాక్షన్!

చ‌ట్ట‌స‌భ‌ల్లో 33శాతం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప‌లు మార్లు పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌స్తావించింది. ఆనాడు వ్య‌తిరేకించిన పార్టీల్లో ఎస్పీ ప్ర‌ధానంగా ఉంది. ఆ పార్టీతో ఇప్పుడు చెట్టాప‌ట్టాలేసుకుని కేసీఆర్ తిరుగుతున్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ ఎస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి అఖిలేష్ యాద‌వ్ ను వెంట‌బెట్టుకుని వెళుతున్నారు. ఆ పార్టీల‌ను నిల‌దీయ‌కుండా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఈనెల 10వ తేదీన ధ‌ర్నాకు పూనుకున్నారు. అంత‌ర్జాతీయ మ‌హిళాదినోత్స‌వం మార్చి 8వ తేదీన తొలుత రిజ‌ర్వేష‌న్ అంశంపై పోరాడేందుకు సిద్ద‌మ‌య్యారు. కానీ, హస్తిన వేగులు ఇచ్చిన ఈడీ స‌మ‌న్ల సమాచారం మేర‌కు ఈనెల 10వ తేదీన ఆందోళ‌న‌కు దిగడానికి క‌విత. ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించారు. అంతేకాదు, సొంత మీడియా ద్వారా వీలున్నంత డ‌బ్బా కొట్టించుకునే ప్ర‌య‌త్నం గ‌త రెండు రోజులుగా చేశారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, ఢిల్లీలో సీబీఐ, ఈడీ క‌ద‌లిక‌ల‌ను బీఆర్ఎస్ పార్టీ(BRS Kavitha) క్ష‌ణ‌క్ష‌ణం తెలుసుకుంటుంద‌ని బోధ‌ప‌డుతోంది.

మ‌హిళా దినోత్స‌వం రోజు ఈడీ నుంచి క‌విత‌కు స‌మ‌న్లు (ED Notice)

మ‌హిళా దినోత్స‌వం రోజు ఈడీ నుంచి క‌విత‌కు స‌మ‌న్లు(ED Notice) రావ‌డం జ‌రిగింది. వాటిని అందుకున్న క‌విత ఆ రోజు కుద‌ర‌ద‌ని చెబుతోంది. కానీ, ఆమె అభ్య‌ర్థ‌న‌ను సీబీఐ మాదిరిగా ఈడీ ప‌ట్టించుకోద‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. ముందు రోజు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ మీద పోరాటం చేయ‌డానికి వెళుతున్నందున విచార‌ణ‌కు రాలేన‌ని క‌విత చెబుతోన్న అభ్యంత‌రం. ఆ త‌రువాత 10వ తేదీ ధ‌ర్నా ఉంది. ఆ రెండు రోజుల త‌రువాత ఎప్పుడైనా విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని చెబుతూ వీలున్నంత ఎస్కేప్ పాల‌సీని ఎంచుకున్నారు. ఎలాగూ ప్ర‌తి రోజూ ఈడీ, సీబీఐ క‌ద‌లిక‌ల‌పై బీఆర్ఎస్ లోని కొంద‌రు వేగులు ప‌నిచేస్తున్నారు. ఆ లోపు బీజేపీ మీద వీలున్నంత దుమ్మేసి వ్ర‌తం చెడ్డా ఫ‌లితం ద‌క్కాల‌నే సామెత లాగా రాజ‌కీయంగా ల‌బ్దిపొందాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేశారని ప్ర‌త్య‌ర్థి పార్టీల అభిప్రాయం.

Also Read : MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్.. రేపు ఢిల్లీకి రావాలని సమన్లు

మొత్తం మీద ప‌లు మ‌లుపులు తిరుగుతూ వ‌చ్చిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ క‌విత(BRS Kavitha) చుట్టూ తిరుగుతోంది. సౌత్ టీమ్ లాబీయింగ్ అంతా క‌విత బినామీల ద్వారా జ‌రిగింద‌ని ప్రాథ‌మికంగా ఈడీ నిర్థారించుకుంది. అందుకు సంబంధించిన ఆధారాల‌ను సేక‌రించింది. దీంతో 2014 వ‌ర‌కు సొంత ఇళ్లు కూడాలేని క‌విత వేల కోట్ల రూపాయాల సామ్రాజ్యం ఇప్పుడు తెర‌మీద‌కు వ‌చ్చింది. పాపం పండితే ఎలా ఉంటుందో, గ‌తంలో క‌నిమొళి విష‌యంలో చూశాం. ఇప్పుడు క‌విత ఎపిసోడ్ క‌నిపిస్తుంద‌ని బీజేపీ నాయ‌కులు కొంద‌రు చెప్పుకోవ‌డం కొస‌మెరుపు.

Also Read : MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ షాక్.. రేపు ఢిల్లీకి రావాలని సమన్లు