BRS Issue : తాండూర్ చ‌ద‌రంగం, బీఆర్ఎస్ కు పైలెట్ పోటు

బీఆర్ఎస్ (BRS Issue) రాజ‌కీయ చద‌రంగం మ‌లుపు తిరుగుతోంది. ప‌రిస్థితుల‌ను

  • Written By:
  • Updated On - April 20, 2023 / 11:12 AM IST

తాండూర్ నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ (BRS Issue) రాజ‌కీయ చద‌రంగం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. అక్క‌డి (Tandoor)ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు అక్క‌డి బీఆర్ఎస్ నేత‌లు పైలెట్ రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి ప‌ట్నం మ‌హీంద‌ర్ రెడ్డి మ‌ధ్య డ్రామా న‌డుస్తోంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఆదిప‌త్య పోరు కొన‌సాగుతోంది. తాజాగా భ‌ద్ర‌శ్వ‌ర‌స్వామి ఆల‌యం ఉత్స‌వాల సంద‌ర్భంగా పొడ‌చూపిన వివాదం భగ్గుమంటోంది. స్వామికి హార‌తి ఇవ్వ‌డానికి కూడా మ‌హీంద‌ర్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌కుండా పైలెట్ వ్య‌వ‌హ‌రించిన తీరు బీఆర్ఎస్ వ‌ర్గ పోరును తారాస్థాయిలో చూపింది.

బీఆర్ఎస్  రాజ‌కీయ చద‌రంగం (BRS Issue)

రెడ్డి సామాజిక వర్గానికే తాండూరులో(Tandoor) బీఆర్ఎస్ టికెట్​ ఇవ్వ‌నుంది. అందుకే ఇద్ద‌రు రెడ్డి సామాజిక‌వ‌ర్గం నేత‌లు కుమ్ములాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం రోహిత్ రెడ్డికి అధిష్టానం వ‌ద్ద బ‌లం ఉంది. ఆ మ‌ధ్య ఎమ్మెల్యేల ఎర కేసులు కీల‌కంగా వ్య‌వ‌హరించారు. బీఆర్ ఎస్ (BRS Issue) చీఫ్ వేసిన ఎత్తుగ‌డ‌కు అనుగుణంగా రోహిత్ రెడ్డి రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టించారు. అందుకు బ‌హుమానంగా ఈసారి ఆయ‌న‌కు టిక్కెట్ ఖాయంగా క‌నిపిస్తోంది. అందుకే, మ‌హీంద‌ర్ రెడ్డి ప‌క్క చూపులు చూస్తున్నార‌ని తెలుస్తోంది. సంకేతాలు అందుకున్న పీసీసీ చీఫ్ రేవం త్ రెడ్డి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్ర‌యోగిస్తున్నార‌ని వినికిడి.

పీసీసీ చీఫ్ రేవం త్ రెడ్డి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్

గ‌త 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి పట్నం మహేందరెడ్డి చేయ‌గా కాంగ్రెస్​అభ్యర్థిగా పైలెట్ రోహిత్ రెడ్డి ఓడించారు. ఆ త‌రువాత పైలెట్ ​బీఆర్​ఎస్​లో చేరారు. అప్ప‌టి నుంచి ఆధిపత్య పోరు మొదలైంది. వాస్త‌వంగా తెలుగుదేశం పార్టీ నుంచి మ‌హీంద‌ర్ రెడ్డి రాజ‌కీయ ఎదుగుద‌ల ఉంది. ఆ త‌రువాత టీఆర్ఎస్ (BRS Issue) పార్టీలో చేరారు. ఆ పార్టీ త‌ర‌పున 2018 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన త‌రువాత ఆయ‌న గ్రాఫ్ ప‌డుతూ వ‌స్తోంది. ఆయన 2014లో తాండూరు నుంచి గెలిచి కేసీఆర్ క్యాబినెట్‌లో రవాణా మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన త‌రువాత గ్రాఫ్ ప‌డిపోతూ వ‌స్తోంది.

చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేస్తానని లీకులు

ఇటీవల సీఎం కేసీఆర్ కు పైలెట్ రోహిత్​రెడ్డి దగ్గర అయ్యారు. అదే సమయంలో పట్నం మహేందర్ రెడ్డి కూడా తాండూర్ ​టికెట్​పై ధీమాతో ఉన్నారు. ఫాంహౌస్​ కేసులో రోహిత్​రెడ్డి జైలుకు పోతారని, మహేందర్​రెడ్డికే టికెట్​వస్తుందని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళ టికెట్ ​రాకపోతే మహేందర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరతారనే టాక్ నడుస్తోంది. అవసరమైతే తాండూర్,(Tandoor) కొడంగల్, పరిగి, వికారాబాద్​అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తన వర్గం లీడర్లను బరిలో దించి, తాను చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేస్తానని లీకులు కూడా ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రూలింగ్​ పార్టీకి అల్టిమేటం అనే చర్చ జరుగుతోంది.

రోహిత్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ స‌న్నిహ‌త సంబంధాల‌ను (Tandoor)

తాండూర్​లో (Tandoor) ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ గ్రాఫ్​పడిపోయిందని, ఇద్దరిలో ఎవరికి టికెట్​ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని బీఆర్ఎస్​ హైకమాండ్ ​సర్వేల్లో తేలినట్లు సమాచారం. అదే జరిగితే మహేందర్ రెడ్డి భార్య జడ్పీ చైర్​పర్సన్​ సునీతారెడ్డికి టికెట్​వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వ‌ర్గాల్లోని మ‌రో వాద‌న‌. అయితే, రోహిత్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ స‌న్నిహ‌త సంబంధాల‌ను కలిగి ఉన్నారు. అందుకే, మ‌హీంద‌ర్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూడ‌కుండా లైట్ గా తీసుకుంటున్నార‌ట‌.

Also Read : KCR Drama : విశాఖ స్టీల్ ఎపిసోడ్ లో `BRS`అబ‌ద్ధాలు

బీఆర్ఎస్ పార్టీలోని గ్రూపుల‌ను (BRS Issue)సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి బీజేపీ ఎత్తుగ‌డ వేస్తోంది. అక్క‌డ నుంచి రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఆదిప‌త్యాన్ని త‌గ్గించేలా బీసీ అభ్యర్థిని బరిలో దింప‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. గతంతో పోలిస్తే ఇక్కడ బీజేపీ పుంజుకుంది. ఆ ఈ క్రమంలో మురళీగౌడ్ ​పేరును హైకమాండ్​ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ ​నుంచి టీపీసీసీ ఉపాధ్యక్ష హోదాలో ఉన్న మల్​కెడ్​ రమేశ్​​కుమార్​ టికెట్​ ఆశిస్తున్నారు. గతంలోనూ రమేశ్​ పేరే వినిపించినా, చివరి నిమిషంలో పైలెట్ టికెట్​సాధించారు. ఇప్పుడు మారిన ప‌రిణామాలు రోహిత్‌, మ‌హీంద‌ర్ రెడ్డికి ప్ర‌తికూలంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వాళ్లిద్ద‌రి ఎత్తుగ‌డ ఎలా ఉంటుంది? అనేది చూడాలి.

Also Read : KTR Son Himanshu : గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తాత KCR ఆశీర్వాదం తీసుకున్న హిమాన్షు..