Site icon HashtagU Telugu

Fake News : ఫేక్ వార్తలతో ప్రజలను మభ్య పెడుతున్న బిఆర్ఎస్

Brs

Brs

తెలంగాణ రాజకీయ వేడి వాతావరణం మరింత పెరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ విభాగం తరచుగా తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేయడం చేస్తూ వస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పై తప్పుడు ప్రచారాలు, కుతంత్ర కథనాలు వైరల్ చేస్తుంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహిస్తూ, రాజకీయ లాభం కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధమైన చర్యలు ప్రజా చర్చల స్థాయిని తగ్గించడమే కాకుండా, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో అపనమ్మకం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!

ఇటీవల ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఏ‌.ఎం. రిజ్వీ మరియు ఎక్సైజ్‌ మంత్రివరులు జూపల్లి కృష్ణారావు మధ్య జరిగిన సంఘటన దీనికి తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. సమాచార లోపం వల్ల ఏర్పడిన చిన్నపాటి అభిప్రాయ భేదాన్ని పెద్దదిగా చూపుతూ, బీఆర్‌ఎస్‌ అనుబంధ మీడియా వర్గాలు తప్పుడు ప్రచారానికి సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అల్లుడు, జూపల్లి కుమారుడు టెండర్లలో ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం చేయడం పూర్తిగా దుష్ప్రచారమే. ఈ విషయం పై మంత్రి స్వయంగా వివరణ ఇచ్చినా కూడా, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఆపడం లేదు. ఈ చర్యల వెనుక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో రాజకీయ లాభం సాధించాలనే ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తాజాగా ప్రసిద్ధ పత్రికల పేర్లను ఉపయోగించి ఫేక్‌ వార్తలను సృష్టించడం కొత్త కుతంత్రంగా మారింది. ప్రతి రోజూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు న్యూస్‌ క్లిప్పింగ్‌లు, డిజిటల్‌ ఇమేజ్‌లు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారాల లక్ష్యం కాంగ్రెసు ప్రభుత్వాన్ని దూషించడం, ముఖ్యమంత్రి రెవంత్‌ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీయడం, మరియు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అవకాశాలను దెబ్బతీయడమే. ప్రభుత్వం ఇప్పటికే ఫేక్‌ న్యూస్‌పై కఠిన చర్యలకు సిద్ధమైంది. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికార వర్గాలు హెచ్చరించాయి. రాజకీయ ర్యాలీలు, సోషల్‌ మీడియా వేదికలు ఇప్పుడు నిజాయతీ మరియు బాధ్యత పరీక్షగా మారాయి. ప్రజలు కూడా వాస్తవం-అసత్యాన్ని గుర్తించే చైతన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎనతైనా ఉంది.

Exit mobile version