Site icon HashtagU Telugu

BRS: ప్రజల సొమ్ముతో రిచెస్ట్ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్

Brs Has Become The Richest Party With People's Money

Brs Has Become The Richest Party With People's Money

BRS One of the Richest Party : ఒక ప్రభుత్వం నడవాలంటే ప్రజలు పన్నులు కట్టాలి. ప్రజలు కట్టిన పన్నులతో ప్రభుత్వాన్ని నడిపించాలి. కానీ ప్రజల సొమ్ముతో పార్టీలను నడిపిస్తున్నారు నేటితరం రాజకీయ నేతలు. రాష్ట్ర ఖజానాలో ఉన్న సొమ్ముని సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు ప్రజలు నుంచి వసూలు చేసిన సొమ్ముని ఎలా వాడుతారు? ఏమైనా అంటే మా పార్టీ ప్రజాపార్టీ అంటూ లేనిపోని మాటలతో అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకప్పుడు పార్టీ ఫండ్ కోసం విరాళాలు సేకరించిన వారే నేడు ఖజానాలో మూలుగుతున్న సొమ్ముని విచలివిడిగా వాడేస్తున్నారు. తాజాగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలను ఎత్తిచూపారు. దేశంలోనే రిచెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అని తేల్చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సి పేపర్ లీకేజి వ్యవహారం సద్దుమణిగింది. లక్షలాది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాన్ని చాలా ఈజీగా డైవర్ట్ చేశారు. అందులో భాగంగానే టెన్త్ పేపర్ లీకేజీని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎవరు చేశారన్నది పక్కనపెడితే రాజకీయంగా కొందరికి మేలు చేకూరింది. టీఎస్పీఎస్సి లీకేజి వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. దాంతో ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ వెంటనే టెన్త్ పేపర్ లీక్ అంటూ వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అరెస్ట్ అయ్యారు. పదవ తరగతి పేపర్ ని లీక్ చేశాడంటూ బండిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు బండి సంజయ్. ఇక ఇదే వ్యవహారంలో తాజాగా ఈటెల రాజేందర్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ జారీ ఈటెలను గంటపాటు విచారించారు. అనంతరం బయటకు వచ్చిన ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

టీఎస్పీఎస్సి పేపర్ లీకేజి అంశాన్ని పక్కదోవ పట్టించడానికే మాపై కేసులు మోపుతున్నారు. ఇదంతా ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే జరుగుతుంది. దేశంలోనే BRS రిచెస్ట్ పార్టీగా ఎదిగింది. సొమ్ము ప్రజలైతే.. సోకు కెసిఆర్ ది అంటూ విమర్శించారు. 22 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న నాపై పేపర్ లీకేజి కేసు పెట్టడం శోచనీయమన్నారు ఈటెల రాజేందర్. 30 లక్షల మంది విద్యార్థుల తరుపున పోరాటం చేస్తున్న మాపై కేసులు పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే పదవ తరగతి పేపర్ లీక్ ను తెరపైకి తీసుకొచ్చారు అంటూ సీఎం కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు ఈటెల.

Also Read:  High Court: హైకోర్టు సంచలనం, మేజిస్ట్రేట్ పై విచారణకు ఆదేశం