BRS : జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్ ఖేల్ ఖతం..?

రోజు రోజుకు బీఆర్‌ఎస్‌ (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నమ్ముకున్న నేతలే పార్టీని నట్టేట ముంచి వెళ్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి టికెట్‌ ఇచ్చినా.. ఆయన కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. సీనియర్‌ నాయకులు కే.కేశవరావు (K.Keshava Rao) లాంటి నేతలు సైతం పార్టీని వీడటంతో పార్టీ మరింత బలహీన పడుతోంది.

  • Written By:
  • Publish Date - March 31, 2024 / 06:38 PM IST

రోజు రోజుకు బీఆర్‌ఎస్‌ (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నమ్ముకున్న నేతలే పార్టీని నట్టేట ముంచి వెళ్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి టికెట్‌ ఇచ్చినా.. ఆయన కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. సీనియర్‌ నాయకులు కే.కేశవరావు (K.Keshava Rao) లాంటి నేతలు సైతం పార్టీని వీడటంతో పార్టీ మరింత బలహీన పడుతోంది. అయితే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party)తన స్థావరాన్ని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని 29 ఎమ్మెల్యే స్థానాలకుగానూ కాంగ్రెస్‌ కేవలం మూడింటిని మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ మొత్తం క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాలనూ కైవసం చేసుకోవాలనే ఆశయంతో కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి స్థానిక నేతలను ఆహ్వానిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్ (Bontu Rammohan) రెండు నెలల క్రితం పార్టీలో చేరారు. ఆయన తర్వాత ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఉన్నారు. నిన్న ప్రస్తుత మేయర్ విజయలక్ష్మి గద్వాల్ (Gadwal Vijayaxmi) కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికలకు ముందు గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచారు. ఒక్కసారిగా హైదరాబాద్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ చేరికతో కాంగ్రెస్ బలపడింది. 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరో ఎనిమిది మంది కార్పొరేటర్లు పార్టీలో చేరి మొత్తం 10కి చేరగా.. రానున్న రోజుల్లో మరో 15 మంది కార్పొరేటర్లు చేరనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మరో 10 మంది ఎమ్మెల్యేలను ఆహ్వానించి ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లో చేరే యోచనలో రేవంత్‌ ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ మెల్లమెల్లగా తన పునాదిని పెంచుకుంటుండగా, నగరంలో అగ్రరాజ్యంగా ఉన్న బీఆర్‌ఎస్ శరవేగంగా నష్టపోతోంది.
Read Also : Navdeep: పెళ్లి పీటలెక్కబోతున్న హీరో నవదీప్.. శుభలేఖ ఫోటోస్ వైరల్?