Site icon HashtagU Telugu

BRS Foundation Day : తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Brs Foundation Day

Brs Foundation Day

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (BRS Foundation Day) సందర్భంగా తెలంగాణ భవన్ (Telangana) లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై..తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..24 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీకి తోడుగా ఉన్న తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటామని , తెలంగాణ కోసం అమరులైన అమరవీరులకు పాదాభి వందనాలు.. తెలంగాణ కోసం పోరాడిన లక్షలాది మందికి రుణపడి ఉంటామని ,తెలంగాణ గొంతుక కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సహకారమయిందని, పార్టీ తరఫున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమన్నారు. సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) వినిపించిందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు. తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ను తీసుకొచ్చిన కేసీఆర్..తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని వెల్లడించారు. తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోమనేలా తమ ప్రస్థానం సాగుతుందని, భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

Read Also : Bk Parthasarathi: టీడీపీ అభ్య‌ర్థికి తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం డ్యామేజ్‌