Mahabubabad : ‘ఇక వేట మొదలైంది.. నా సత్తా ఏంటో చూపిస్తా’ – బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక

మహబూబాబాద్ (Mahabubabad ) బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ (BRS Ex Shankar Naik ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial Comments) చేసి వార్తల్లో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వివాదాలు కొత్తేమి కాదు..మొదటి నుండి అనేక సందర్భాల్లో ఆయన నిలిచారు. అప్పటి సీఎం కేసీఆర్ నుండి కూడా చివాట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తీరు మార్చుకోలేదు. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ […]

Published By: HashtagU Telugu Desk
Mhbd Ex Mla

Mhbd Ex Mla

మహబూబాబాద్ (Mahabubabad ) బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ (BRS Ex Shankar Naik ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial Comments) చేసి వార్తల్లో నిలిచారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు వివాదాలు కొత్తేమి కాదు..మొదటి నుండి అనేక సందర్భాల్లో ఆయన నిలిచారు. అప్పటి సీఎం కేసీఆర్ నుండి కూడా చివాట్లు తిన్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తీరు మార్చుకోలేదు. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ చేతిలో ఓటమి చెందారు. శంకర్ నాయక్ ఓడిపోవడం గ్యారెంటీ అని ముందు నుండి అంత చెపుతూనే ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన ఫై పూర్తి వ్యతిరేకత ఉందని..భూకబ్జా లు , ఉద్యోగులపై ఒత్తిడి..సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం ఇలా చాల వాటిల్లో ఆయనపై వ్యతిరేకత ఉంది..కేసీఆర్ కు సైతం బిఆర్ఎస్ నేతలు శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వద్దని..ఇస్తే సపోర్ట్ చేయమని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కేసీఆర్ మరోసారి ఆయనకు టికెట్ ఇచ్చి బోల్తా పడ్డాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె ఈరోజు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. “నా కూతురుకి పెళ్లి చేసి అమెరికా పంపిస్తా. నా కొడుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేర్పిస్తా. నాకు 54 సంవత్సరాలు దాటాయి. బతికినకాడికి చాలు. ఇక శంకర్ వేట మొదలైంది. నా సత్తా చూపిస్తా” అని సవాల్ విసిరారు.

“నేను కేసీఆర్ ఒక్కటే కార్తెలో పుట్టాం. నా నియోజకవర్గం కాపాడుకునే సత్తా నాకు ఉంది. నీనేంటో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అందరికీ తెలుసు. మళ్లీ మీకోసం వస్తా. మనం ఎవరిజోలికి పోవద్దు మన జోలికి ఎవ్వడైన వస్తే వాడిని వదిలిపెట్టొద్దు. ఇప్పుడు నన్ను ఆపేవాడు ఎవ్వరూ లేరు. ఆపే శక్తి కూడా ఎవ్వడికీ లేదు” అని శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి.

Read Also : PDF MLC Shaik Sabji Died : పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం..రోడ్డు గుంతలే కారణమా..?

  Last Updated: 15 Dec 2023, 02:33 PM IST