Site icon HashtagU Telugu

Danam Nagender : దానం నాగేందర్ పై స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

Brs Comp

Brs Comp

బిఆర్ఎస్ (BRS) పార్టీ నుండి గెలిచి..కాంగ్రెస్ (COngress) గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఫై అనర్హత వేటు వెయ్యండి అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAS) స్పీకర్ కు పిర్యాదు చేసారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సంద‌ర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ త‌ర‌పున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేంద‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరామ‌ని తెలిపారు. యాక్ష‌న్ తీసుకుంటామ‌ని స్పీక‌ర్ చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. ఒక పార్టీ త‌ర‌పున గెలిచి మ‌రో పార్టీలో చేరే ఎమ్మెల్యేల‌ను రాళ్ల‌తో కొట్టి చంపాల‌ని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల‌ను ఎలా తీసుకుంటారు అని ప్ర‌శ్నించారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో దానం పై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదని తెలిపారు. మేము ఒక అడుగు వెనకడుగు వేశాం అంటే నాలుగు అడుగులు ముందుకు వేస్తామన్నారు. ఒక దెబ్బ మీరు కొట్టారు, మేము కొట్టడానికి సిద్దంగా ఉన్నామన్నారు. మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఐదేళ్లు మేము ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉండొచ్చు.. కాంగ్రెస్ లో జరిగే అంతర్గత కలహాలకు మేము భాద్యులం కామని క్లారిటీ ఇచ్చారు.

Read Also : NDA Bihar : బిహార్‌లో ‘పొత్తు’ పొడిచింది.. బీజేపీకి 17, జేడీయూకు 16