BRS Party: తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం సాయంత్రం నంది నగర్ నివాసంలో ఛలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కర్తలతో విడివిడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి వివరించేందుకు నల్లగొండ పట్టణంలో ఈనెల 13న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను అధినేత వారికి వివరించారు.
బీఆర్ఎస్ చలో నల్లగొండ భారీ బహిరంగ సభ -సమన్వయకర్తలు
1 )హుజూర్ నగర్ ..మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
2 )దేవర కొండ-పంజాల గోపి రెడ్డి
3) నల్లగొండ పట్టణం -రవీందర్ సింగ్
4 )తుంగ తుర్తి -మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
5 )మునుగోడు -నందికంటి శ్రీధర్
6 )కోదాడ ..ఎమ్మెల్సీ రవీందర్ రావు
7 )నకిరేకల్ -మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
8 )మిర్యాల గూడ -ఆదర్శ్ రెడ్డి (పటాన్ చెరు బీ ఆర్ ఎస్ నేత ),ముజీబ్ (కామా రెడ్డి బీ ఆర్ ఎస్ నేత )
9 )సూర్యాపేట -మాజీ మంత్రి జోగు రామన్న
10 )నాగార్జున సాగర్ ..మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్
11 )భువన గిరి -మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,కరీంనగర్ జిల్లా బీ ఆర్ ఎస్ సీనియర్ నేత జి .వి .రామకృష్ణా రావు
12 )ఆలేరు -మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు