Site icon HashtagU Telugu

Telangana: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎజెండా ఒక్కటే: సీఎం యోగి

Telangana

Telangana

Telangana: బీఆర్ఎస్ , కాంగ్రెస్ ల ఎజెండా ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు వ్యక్తిగత అభివృద్ధి కోసమే పనిచేస్తాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వేములవాడలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎంకు భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేదన్నారు. భాజపా అధికారంలోకి రాగానే అధికారికంగా జరుపుకుంటామన్నారు.

ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇక్కడి పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. ముస్లిం రిజర్వేషన్లే ఇందుకు నిదర్శనం. భాజపా గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి వెనుకబడిన వర్గాలకు చేయూత అందిస్తామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ తో రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ ప్రభుత్వం ఏ డిమాండ్ ను నెరవేర్చలేకపోయింది. 2017కు ముందు యూపీలో ఇదే పరిస్థితి.. అప్పట్లో యువత, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఆరేళ్లలో అక్కడ ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాం. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటే ఉపాధిని కల్పించడంతోపాటు డబుల్ ఇంజిన్ స్పీడ్‌తో శాంతిభద్రతలను అందించడమేనని సీఎం యోగి అన్నారు.

Also Read: Indrakeeladri : భ‌వానీ దీక్షాప‌రుల‌తో కిట‌కిట‌లాడుతున్న ఇంద్ర‌కీలాద్రి