Praja Palana : రూ.50 , రూ.100 లకు అభయ హస్తం దరఖాస్తు పత్రాలను అమ్ముతున్న దళారులు

  • Written By:
  • Publish Date - December 28, 2023 / 03:12 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా (Praja Palana) కార్యక్రమంలో కొంతమంది దళారులు అప్లికేషన్ పత్రాలను అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామల్లో ఈ కార్యక్రమం జరుగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం నుండి ప్రజలు కౌంటర్ల వద్ద బారులదీరారు. చాలామంది మహిళలు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయంతో పాటు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పలుచోట్ల దరఖాస్తులను జిరాక్స్, మీ సేవా కేంద్రాల్లో రూ. 20 నుంచి 50వరకు విక్రయించడం.. ఫిలప్ చేయడానికి మరో రూ. 100 తీసుకోవడం చేస్తున్నారు. మరికొంతమంది కౌంటర్ల బయట అభయ హస్తం అప్లికేషన్ ఫామ్ లను 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఇలా జరుగుతుంది..దీనిని పట్టించుకునే వారు లేకపోవడంతో పేద ప్రజలు తప్పదని కొంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్లను కూడా కొందరు దళారులు జిరాక్స్ సెంటర్లు దళారులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు.

Read Also : Free Scheme : బస్సుల కోసం పడిగాపులు…ఫ్రీ అంటే ఇదేనేమో..!