తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను జూన్ 12న తిరిగి ప్రారంభించనున్నట్లు (Schools Reope) ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు పాఠశాలలు మొదలైన అదే రోజున పుస్తకాలు, యూనిఫార్ములు (Books, Uniforms) అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు విద్యాసంవత్సరం ఆరంభం నుంచే అవసరమైన వసతులు అందుబాటులో ఉండనున్నాయి.
Gulzar House : హైదరాబాద్‌లోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో జూన్ 6 నుండి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, పాఠశాల కమిటీలు, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు భాగస్వాములవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో సామూహికంగా ఇది చేపట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల పెరుగుదల కోసం ప్రచారం నిర్వహించాలని తెలిపారు.
జూన్ 7న ప్రత్యేకంగా ప్రతి ఇంటిని సందర్శించేందుకు టీమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్శనల ద్వారా బడికి వెళ్లని పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్చే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విధంగా విద్యకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వ ధోరణి రాష్ట్రంలో విద్యాస్థాయిని మెరుగుపర్చే దిశగా ముందడుగు వేస్తోంది.