Telangana Bonalu: బోనాల పండుగకు వేళాయే..!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బనాల పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది.

  • Written By:
  • Updated On - May 9, 2023 / 11:47 AM IST

తెలంగాణ (Telangana) అంటే బోనాలు.. బోనాలు (Bonalu) అంటే తెలంగాణ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బనాల పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలంగాణ బిడ్డలు ఈ పండగును జరుపుకోవడానికి ఇష్టం చూపుతారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పండుగ లష్కర్ బోనాలు జూలై 9న సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించనున్నారు. బోనాలు ఆషాడ మాసం మొదటి ఆదివారం నాడు ప్రారంభమవుతాయి. జూన్ 25న ప్రారంభమై జూలై 16 వరకు కొనసాగుతాయి. ఉత్సవాలు మొదట గోల్కొండ ప్రాంతంలో తరువాత సికింద్రాబాద్‌లో, ఆ తర్వాత నగరంలోని మిగిలిన ప్రాంతాలలో జరుగుతాయి.

సోమవారం ఉజ్జయిని మహంకాళి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) మాట్లాడుతూ జూలై 10న ఆలయంలో రంగం వార్షిక క్రతువు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై త్వరలో అన్ని ప్రభుత్వ సంస్థల అధికారులు, ఉజ్జయిని మహంకాళి ఆలయ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు.

అంతేకాకుండా ఆలయ పరిసరాల్లో (Temple) రోడ్డు పునరుద్ధరణ, డ్రైనేజీకి సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు, నిరంతర విద్యుత్, నీటి సరఫరా ఉండేలా చూడాలని, ఆలయానికి వెళ్లే రహదారులను తీర్చిదిద్దాలని తలసాని అధికారులను కోరారు. బోనాల పండుగకు సంబంధించిన ఆలయ అలంకరణ, ఇతర ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిధులు (Funds) విడుదల చేస్తుందని తలసాని తెలిపారు.

Also Read: TSRTC: మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్!