Site icon HashtagU Telugu

Telangana BJP : తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వేలు..

Bjp

It is not lack of funds for the Congress party, it is the lack of candidates, BJP

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల (Lok Sabha Elections) నగారా నడుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు అధికారం చేపట్టిన బిజెపి (BJP) మూడోసారి విజయం సాదించబోతుందా..లేదా..? సాధిస్తే ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది..? ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు బిజెపి పోటీ ఇస్తాయి..? కాంగ్రెస్ గాలి ఎంతగా వీస్తుంది..? కాంగ్రెస్ ఈసారి కూడా గెలవకపోతే ఏంటి పరిస్థితి..? మరి తెలంగాణ లో ఏ పార్టీ ముందంజలో ఉంది..? ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు..? ఇలా అనేక ప్రశ్నల గురించి అంత మాట్లాడుకుంటున్నారు.

ఈ తరుణంలో అనేక సర్వేలు (Surveys) ప్రజలు అభిప్రాయాన్ని సేకరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తమగా అనేక సర్వేలు మరోసారి బిజెపి విజయం సాదించబోతుందని చెపుతున్నాయి. ఇక తెలంగాణా లో బిజెపి గ్రాఫ్ పెరిగిందని అంటున్నాయి. దీనికి కారణం బిఆర్ఎస్ ఓట్లు..బిజెపి కి షిఫ్ట్ కావడమే అని అంటున్నారు. తాజాగా జన్ లోక్ పోల్ (Jan Lok poll Survey), న్యూస్ ఎక్స్ (NewsX ) సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ఇలాగే చెపుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

జన్ లోక్ పోల్ సర్వే ప్రకారం..తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 9-10 స్థానాల్లో గెలవబోతున్నదని చెపుతుంది. అధికార కాంగ్రెస్ 7-8 స్థానాలు, ఇతరులు 0-1 స్థానంలో గెలవబోతున్నట్లు అంచనా వేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు సేకరించిన ప్రజాభిప్రాయంలో ఈ విషయం వెల్లడైనట్లు తాజాగా తెలిపింది. దీనికి కారణం గత నెలతో పోలిస్తే ఈ నెల బిఆర్ఎస్ ఓట్లు బిజెపికి షిఫ్ట్ కావడం వల్లే బిజెపి గ్రాఫ్ పెరిగిందని అంటున్నారు.

ఇక న్యూస్ ఎక్స్ సర్వే ఫలితాల ప్రకారం.. మెజార్టీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉందని , కాకపోతే బిజెపి కూడా గట్టి పోటీనే ఇస్తుందని చెప్పుకొచ్చింది. బీఆర్ఎస్ గతంతో పోలిస్తే భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 5, బీఆర్ఎస్‌కు 3 ఎంఐఎంకు 1 స్థానం దక్కబోతున్నదని అంచనా వేసింది. మరి వీరి లెక్కలు కరెక్ట్ అవుతాయో..లేదో తెలియాలంటే మరో రెండు నెలల వరకు వెయిట్ చేయాల్సిందే.

Read Also : Vishwaguru Ugadi Awards 2024: ఉగాది పురస్కారం అందుకున్న సంధ్యారాగం సినిమా దర్శకుడు శ్రీనివాస్ నేదునూరి