KCR & Etela: బీజేపీ బిగ్ స్కెచ్, కేసీఆర్ పై ఈటల పోటీ?

అధ్యక్షుడి మార్పుతో బీజేపీ లో జోష్ తగ్గింది. దీంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ద్రుష్టి సారించింది.

  • Written By:
  • Updated On - August 3, 2023 / 04:55 PM IST

KCR & Etela: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంది. అదే సమయంలో అధ్యక్షుడి మార్పుతో బీజేపీ లో జోష్ తగ్గింది. దీంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ద్రుష్టి సారించింది. ఇందుకు ప్రణాళికా ప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలోగ్రామీణ నియోజకవర్గాల్లో బలమైన నేతలను సమ కూర్చుకోవడమే లక్ష్యంగా కాషాయదళం కొత్తప్రణాళికను అమలు చేస్తోంది.

అయితే గజ్వేల్‌ నుంచి కేసీఆర్ మీద ఈటల బరిలోకి దిగబోతున్నారన్నది ఆ న్యూస్‌ ఉద్దేశం. బీజేపీలో కీలక నేతలంతా ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకున్నారని.. దీనికి సంబంధించి లిస్ట్ ఇదే అటూ సోషల్ మీడియాలో ఓ జాబితా వైరల్ అవుతోంది. అంబర్‌పేట నుంచి కిషన్ రెడ్డి.. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌.. గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్‌.. దుబ్బాక నుంచి రఘునందన్‌ రావు.. చెన్నూరు నుంచి వివేక్‌.. భువనగిరి నుంచి బూర నర్సయ్య.. హుజురాబాద్ నుంచి ఈటల జమున.. గోషామహల్ నుంచి విక్రమ్‌ గౌడ్‌..సికింద్రాబాద్‌ నుంచి జయసుధ.. తాండూర్ నంచి కొండా విశ్వేశ్వర్.. ఇలా కొందరి పేర్లతో ఉన్న ఓ లిస్ట్ తెగ వైరల్ అవుతోంది.

మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయబోతున్నారనే ప్రచారమే ఇప్పుడు రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలోని(Telangana) జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లోనే కొంతమేర పట్టుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంక్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీ-.బీజేపీకి హైకమాండ్‌ ఫిక్స్‌ చేసిన టార్గెట్‌ 75 సీట్స్‌. ఈ నెంబర్‌ సాధించాలంటే, ముఖ్యనేతలంతా అసెంబ్లీ బరిలోకి దిగాలన్నది అమిత్‌షా వ్యూహంగా కనిపిస్తోంది. గెలిచే అవకాశమున్న 75 స్థానాలను గుర్తించడంతోపాటు- కనీసం 35 నుంచి 50 మంది కీలక నేతలను గుర్తించి ఎన్నికలకు సిద్ధమయ్యేలా చూడాలని షా కోరినట్టు తెలుస్తోంది.

Also Read: Kedarnath Bicycle Trip: సైకిల్ పై సాహాసం, జనగాం నుంచి కేథార్ నాథ్ వరకు ఆధ్యాత్మిక యాత్ర