Site icon HashtagU Telugu

Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి

BJP Telangana State President Kishan Reddy's sensational comments

BJP Telangana State President Kishan Reddy's sensational comments

Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్‌రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా అందజేయాలని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలని పేర్కొన్నారు. వరికి 5 వందల రూపాయల బోనస్ అందించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల దెబ్బతిన్న పంటలతో నష్టపోయిన రైతులకు 25వేల రూపాయలు ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో రైతులపై హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు అంటే ఎన్ని రోజులో చెప్పాలి అని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశించారు. కాంగ్రెస్ పార్టీ మాటలకే కానీ చేతలకు కాదని ధ్వజమెత్తారు.

Read Also: Producer Naveen Yerneni : ఫోన్ ట్యాపింగ్ కేసులో పుష్ప నిర్మాత..

కిషన్‌ రెడ్డి ప్రధాన డిమాండ్స్ ఇవే..

.వడ్లకు క్వింటాల్ రూ.500 బోనస్ వెంటనే అమలు చేయాలి.
.రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలి.
.కరువు వలన నష్టపోయిన రైతులకు రూ. 25వేల నష్టపరిహారాన్ని అందించాలి.
.రైతు కూలీలకు రూ.12000 బ్యాంక్ అంకౌట్ లో జమ చేయాలి.
.రైతు భరోసా ద్వారా 15వేల రూపాయలను రైతులకు అందించాలి.