BJP Meeting: కరీంనగర్ లో బీజేపీ బహిరంగ సభ.. నడ్డా రాక!

తెలంగాణ బీజేపీ మరో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సభకు జేపీ నడ్డా (JP Nadda) హజరుకాబోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
BJP Chief

BJP Chief

బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 15 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని ఎల్లుండి (గురువారం) SRR కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా (JP Nadda) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జీ మురళీధర్ రావు సహా పలువురు ముఖ్య నేతలు ఈ బహిరంగ సభకు వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సభ సాయంత్రం ముగియనుంది.

• ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పార్టీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించడంతోపాటు వారి రవాణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్సారార్ మైదానంతోపాటు కరీంనగర్ (Karimnagar) యావత్తు జన సంద్రం అయ్యే అవకాశాలున్నాయి.

• ఈ బహిరంగ సభను సక్సెస్ చేయడం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీ (BJP)యేననే సంకేతాలను పంపాలని భావిస్తోంది. అత్యధిక సంఖ్యలో జనం అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలనకు కాలం చెల్లిందనే భావన పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయి. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి కేసీఆర్ గ్రాఫ్ అమాంతంగా పెరగడానికి బీజం వేసింది కరీంనగరే. ఎక్కడైతే కేసీఆర్ కు రాజకీయ భవిష్యత్తుకు అగ్రపీఠం వేసిన కరీంనగర్ లోనే సభను సక్సెస్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పనైపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బండి సంజయ్ యోచిస్తున్నారు.

• తెలంగాణ (Telangana) ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని ఈ సందర్భంగా సంజయ్ (Bandi Sanjay) పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ యువత, హిందుత్వ భావజాలమున్న ప్రజలంతా స్వచ్ఛందంగా కరీంనగర్ (Karimnagar) బహిరంగ సభకు వెళ్లాలని యోచిస్తుండటం గమనార్హం.

• మరోవైపు ఈనెల 15న నాటికి బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి కానుంది. కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ (Bandi Sanjay) గత 4 విడతల్లో చేపట్టిన పాదయాత్ర 13 ఎంపీ, 48 అసెంబ్లీ, 21 జిల్లాల మీదుగా సాగింది. మొత్తం 1178 కి.మీలు నడిచారు. తాజాగా మైసా(బైంసా) నుండి ప్రారంభమైన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, జగిత్యాల, కొండగట్టు, గంగాధర మీదుగా సాగి కరీంనగర్ ఎస్సారార్ కళాశాలవద్ద ముగిసింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 222 కి.మీలు నడిచారు. తద్వారా మొత్తం ఐదు విడతల్లో బండి సంజయ్ మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1400 కి.మీలు నడిచారు.

• మరోవైపు కరీంనగర్ (Karimnagar) లో జరిగే బహిరంగ సభ వేదికపైనా 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ను ప్రకటించేందుకు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.

• భాగ్యలక్ష్మీ అమ్మవారి పాదాల చెంత బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి ఎల్లుండి కరీంనగర్ లో నిర్వహించబోయే సభ వరకు మొత్తం 14 భారీ బహిరంగ సభలు, వందకుపైగా మినీ సభలతోపాటు పెద్ద ఎత్తున రచ్చబండలు, స్థానిక నేతలతో ఇంట్రాక్షన్ చర్చలు జరిగాయి. భారత దేశ చరిత్రలో ముఖ్యంగా బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల్లోనూ ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన దాఖాల్లేవని మనోహర్ రెడ్డి తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: కాంగ్రెస్ కొత్త కమిటీపై భట్టి సీరియస్!

  Last Updated: 13 Dec 2022, 05:35 PM IST