Site icon HashtagU Telugu

Jp Nadda: 25న నాగర్‌కర్నూల్ జిల్లాకు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. షెడ్యూల్ ఇదే..

Bjp National President Jp Nadda

Bjp National President Jp Nadda

బీజేపీ (BJP) కేంద్ర పెద్ద‌లు తెలంగాణ‌ (Telangana) పై ఫోక‌స్ పెట్టారు. మ‌రికొద్ది నెల‌ల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించి అధికార పీఠాన్ని ద‌క్కించుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీ జాతీయ నేత‌లు తెలంగాణ‌లో వ‌రుస‌గా ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, ఈ నెలలో కేంద్ర మంత్రి అమిత్ షా  (Amit shah) ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించాల్సి ఉంది. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల షా ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. తాజాగా జేపీ న‌డ్డా తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గోనున్నారు.

జేపీ న‌డ్డా ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే..

–  బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా ఈనెల 25న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు.
–  మ‌ధ్యాహ్నం 12.45 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు న‌డ్డా చేరుకుంటారు.
–  1.15 గంట‌ల నుంచి 2.30 గంట‌ల వ‌ర‌కు సంపర్క్ సే అభియాన్‌లో భాగంగా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను క‌లుసుకుంటారు.
–  సాయంత్రం 3.00గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు.
–  4.00గంటల వరకు నోవాటెల్ హోటల్లోనే నడ్డా ఉంటారు.
–  4.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి నాగర్‌కర్నూల్ సభకు హెలికాప్టర్‌లో న‌డ్డా బ‌య‌లుదేరుతారు.
–  4.45 నిమిషాల‌కు నాగర్‌క‌ర్నూల్‌కు న‌డ్డా చేరుకుంటారు.
–  5 నుంచి 6 గంటల వరకు నాగర్‌కర్నూల్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్‌లో ఎర్పాటు చేసిన సభ‌లో న‌డ్డా పాల్గొంటారు.
–  6.10 నిమిషాలకు నాగర్‌కర్నూల్ నుంచి బయలు దేరుతారు.
–  6.40 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
–  రాత్రి 7.40 నిమిషాలకు ఎయిర్ పోర్ట్ నుండి తిరువనంతపురంకు న‌డ్డా బ‌య‌లుదేరి వెళ్తారు.

Jack Ma: అపర కుబేరుడు అయిన జాక్ మా.. జీవితంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్నాడా?