తెలంగాణలో రాజకీయాలు వేడి పెరుగుతున్న వేళ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao Arrest ) అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసింది. శుక్రవారం (జనవరి 17) వెలిమల తండాలో గిరిజనుల మద్దతుగా ఆందోళన నిర్వహిస్తున్న రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వెలిమల తండాలో భూవివాదం గత పది రోజులుగా కొనసాగుతుంది. గిరిజనులు తమ భూములకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడంతో రఘునందన్ రావు గిరిజనుల పక్షంలో నిలుస్తూ వారికి మద్దతుగా పాల్గొన్నారు.
Deputy CM Bhatti: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
రఘునందన్ రావు తన పార్టీ శ్రేణులతో కలిసి వెలిమల తండాకు చేరుకుని, అక్కడి గిరిజనులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు పలుమార్లు ఆందోళన విరమించాలని కోరినప్పటికీ, ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్ రావును అరెస్టు చేయడంపై గిరిజనులు, బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గిరిజనుల హక్కుల పక్షాన బీజేపీ పోరాడుతుందని పార్టీ నేతలు ప్రకటించగా, రఘునందన్ రావు అరెస్ట్‌పై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.