Site icon HashtagU Telugu

BJP MP Laxman : నాయకత్వ మార్పు గురించి పార్టీలో చర్చ జరగలేదు.. తెలంగాణలో బీజేపీ విజ‌యం ఖాయం

Mp Laxman

Mp Laxman

తెలంగాణ బీజేపీ (Telangana BJP) అధ్య‌క్ష ప‌ద‌విపై ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేదని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ల‌క్ష్మ‌ణ్ (BJP MP Laxman )  అన్నారు. శ‌నివారం బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా (JP Nadda), బీఎల్ సంతోస్ (BL Santos) నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, మోర్చా అధ్యక్షుల సమావేశం జ‌రిగింది. సుదీర్ఘంగా జ‌రిగిన ఈ స‌మావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై చ‌ర్చించారు. స‌మావేశం అనంత‌రం ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామ‌ని అన్నారు. భవిష్యత్ కార్యాచరణ, బీసీ కార్యాచరణ, బీసీ సదస్సులు, సామాజిక సమ్మేళనలు జరపాలని నిర్ణయించామ‌ని చెప్పారు. నెల రోజుల్లో రోడ్ మ్యాప్ తయారు చేసి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తామ‌ని అన్నారు. జులై 8న మరోసారి మోర్చా అధ్యక్షుల సమావేశం జరుగుతుందని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు.

దేశ అభివృద్ధి మోడీతోనే సాధ్యమ‌ని, ఉమ్మడి పౌర స్మృతి మోడీతోనే సాధ్యమ‌ని ప్రజలు భావిస్తున్నారని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, మహిళా, రైతులకోసం తీసుకున్న నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలు బీజేపీ ఘ‌న‌త అని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. స‌ల్పకాలిక, దీర్ఘకాలిక కార్యాచరణలు సిద్ధం చేస్తున్నామ‌ని, పార్టీ విస్తరిస్తున్నపుడు భిన్నాభిప్రాయాలు రావడం సహజమేని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని, బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు ఒక గూటి పక్షులు అంటూ విమ‌ర్శించారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమ‌ని ల‌క్ష్మ‌ణ్ దీమా వ్య‌క్తం చేశారు. బీజేపీ నేతలు పార్టీ మారతారనేది వార్తలు మాత్రమేన‌ని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే గెలిచిన వారు బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని ల‌క్ష్మ‌ణ్ ఎద్దేవా చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ కింద లా కమిషన్ ప్రజాభిప్రాయం తీసుకుంటుందని, అందరికి మేలు చేసేందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అమ‌ల్లోకి తేవాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌ని, యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ వల్లనే రాబోతుంద‌ని ల‌క్ష్మ‌న్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల వ్యూహం ఈనెల 9 తేదీ తెలంగాణలో చర్చ జరుగుతుంద‌ని అన్నారు. 8వ‌ తేదీ తెలంగాణకు ప్రధాని మోడీ వస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం దృష్టిసారించింద‌ని చెప్పారు. నాయకత్వ మార్పు గురించి పార్టీలో చర్చ జరగలేదని, కేంద్ర మంత్రులు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు తీసుకుంటారనే చర్చ పార్టీలో లేదని ల‌క్ష్మ‌ణ్ అన్నారు.

Chris Gayle: భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ పై క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?