Site icon HashtagU Telugu

Free Bus Travel: అలాంటి మహిళలు ఫ్రీ జర్నీ చేస్తే బిచ్చగాళ్లతో సమానం

Bjp Mla Katipally Venkata Ramana Reddy

Bjp Mla Katipally Venkata Ramana Reddy

Free Bus Travel: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పేరు సంచలనంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఓడగొట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ గా నిలిచాడు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి సత్తా చాటాడు. సైలెంట్ గా వచ్చి వైలెంట్ గా విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. ఈ విజయంతో తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, కామారెడ్డి రాజకీయం ఒకత్తు అన్నట్టుగా మారిపోయింది.

గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రకటించింది.ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత జర్నీ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కిడికైనా.. పల్లె వెలుగు, సిటీఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు తీసుకొచ్చారు. ఈ ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరింది. అయితే ఈ పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఉచిత బస్సు సౌకర్యం కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.

ఇదిలా ఉండగా నెలకు రూ.10 వేలు ఆదాయం ఉన్న మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటే తన దృష్టిలో వాళ్ళు బిచ్చగాళ్లలాంటి వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. ఆదాయం, ఆస్తులు ఉన్నా పింఛన్, రైతు బంధు, రేషన్ కార్డు తీసుకున్న వాళ్లంతా బిచ్చగాళ్లేనని సెన్సేషన్ కామెంట్స్ చేశాడు.ప్రస్తుతం కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాన్ని వినియోగించుకోవడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. మరి నెలకు రెండున్నర లక్షలుపైగా సాలరీ తీసుకుంటూ కూడా ప్రభుత్వ వాహనం వాడుకునే మీలాంటి వాళ్ళను ఏమనాలో కూడా మేరె చెప్పండి అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Also Read: Vegetarian Foods: మాంసాహారం కంటే శాఖాహారమే ఉత్తమం.. ఎందుకంటే..?