CM Revanth Reddy : సీఎం రేవంత్ ను అభినందించిన బిజెపి ఎమ్మెల్యే

CM Revanth Reddy : గోమాత రక్షణ కోసం ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి మోడల్ గోశాలల నిర్మాణం ప్రకటించడంతో ఇది మంచి ప్రారంభమని రాజాసింగ్ అన్నారు

Published By: HashtagU Telugu Desk
Rajasingh Revanth

Rajasingh Revanth

తెలంగాణలో కొత్తగా గోశాలలు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth )కి ధన్యవాదాలు తెలిపారు. గోమాత రక్షణ కోసం ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి మోడల్ గోశాలల నిర్మాణం ప్రకటించడంతో ఇది మంచి ప్రారంభమని రాజాసింగ్ అన్నారు. గోరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ, అందులో తాను సభ్యుడిగా ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించారు.

PM Modi : పాక్‌ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్‌తో మోడీ

తెలంగాణలో గోవధ ఇంకా కొనసాగుతున్నదని, అనుమతులేని స్లాటర్ హౌస్‌లలో ఆవులు, ఎద్దులు, దూడలు చంపబడుతున్నట్టు రాజాసింగ్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వానికి ఖచ్చితమైన చర్యలు తీసే బాధ్యత ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై తమ కార్యాచరణ స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ గోమాతల రక్షణ కోసం చేపట్టిన చర్యలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినట్టు తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా గోసేవలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేలా పని చేస్తే, దేశంలో ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుందని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

Youtube : యూట్యూబ్ లో ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే వైరల్ అవుతుందో తెలుసా..?

ఇదిలా ఉండగా ఇటీవల వేములవాడ ఆలయ గోశాలలో గోవుల మరణం పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై బీజేపీ నేతలు ప్రభుత్వం వైఫల్యాన్ని దోషంగా చూపుతున్నారు. కాగా ఆలయ అధికారులు, కాంగ్రెస్ నేతలు మాత్రం అవి అనారోగ్య కారణాలతో మృతిచెందాయని వివరణ ఇచ్చారు. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం గోశాలలు, గోరక్షణపై తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయపరంగా సానుకూల స్పందనను తెచ్చుకున్నాయి. ప్రజాపక్షంలో మంచి పనులు చేస్తే విభిన్న పార్టీలకు చెందిన నేతల నుంచి కూడా మెప్పు అందుకోవచ్చని ఈ పరిణామం నిరూపిస్తోంది.

  Last Updated: 18 Jun 2025, 12:02 PM IST