మాములుగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పార్టీల కీలక నేతలు పాదయాత్ర (Paadayatra) చేపట్టి..వార్తల్లో నిలుస్తూ ప్రజలకు దగ్గర అవుతుంటారు. కానీ తెలంగాణ (Telangana) లో మాత్రం నేతలు ప్రజల మనసు గెలుచుకునేందుకు పాదయాత్రను ఎంచుకుంటున్నారు. సీఎం (CM) దగ్గరి నుండి ప్రతిపక్ష నేతల వరకు ప్రతి ఒక్కరు పాదయాత్ర బాట పడుతున్నారు. తాజాగా బిజెపి నేతలు (BJP Leaders) సైతం తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలనీ డిసైడ్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పాదయాత్రలు చేపట్టేందుకు డిసైడ్ అయ్యింది. డిసెంబర్ 1 నుంచి ఈ పాదయాత్రలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను ఇచ్చినప్పటికీ, వాటిని అమలు చేయడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ప్రజలలోకి వెళ్లి, నియోజకవర్గాల వారీగా పాదయాత్రల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా, ఈ నెల 15 లేదా 16న మూసీ పరీవాహక ప్రాంతంలో రాత్రి బస చేయాలని బీజేపీ నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న బీజేపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రాత్రి అక్కడ బస చేయనున్నారు.
Read Also : Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే