BJP : నగరంలోని ప్రధాన సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు సచివాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో, నగరంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. సుమారు వందలాది మంది పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు ప్రాంతాల్లో నిఘా పెంచి, భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, తుర్కయాంజల్ ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Also: Chiru Birthday : ”వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్” అంటూ అల్లు అర్జున్ ట్వీట్..దారికి వచ్చినట్లేనా..?
ఇక మరోవైపు, సరూర్‌నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి సచివాలయం దిశగా ర్యాలీకి ప్రయత్నించగా, ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు నాయకులను అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మద్య తరచుగా నినాదాలు చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేసిన కార్యకర్తలను కూడా పోలీసులు చెదరగొట్టారు. బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే తమ ఆందోళన చేశామని, ప్రభుత్వం ప్రజావేదికను మూసివేయాలన్నట్టు పోలీసుల వైఖరి ఉందని విమర్శించారు.
నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, మౌలిక వసతుల కల్పనలో GHMC విఫలమవుతోంది. మేము అధికారులను కలసి సమస్యలు విన్నవించేందుకు ప్రయత్నించాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని అణచివేయాలని చూస్తోంది అని ఒక పార్టీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, పోలీసులు తమ చర్యలను సమర్థించుకుంటూ, శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు తప్పనిసరి అయ్యాయని తెలిపారు. అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలను సచివాలయం వద్దకి తే
వాలనుకోవడం చట్ట విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనల నేపథ్యంలో నగరంలో కొన్ని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినట్టు సమాచారం. పలు బస్సులు మార్గం మళ్లింపు చేయడం జరిగింది. మొత్తంగా సచివాలయం ముట్టడి పిలుపుతో నగరవ్యాప్తంగా భాజపా కార్యకలాపాలు కలకలం రేపినట్లు చెప్పొచ్చు.
Read Also: Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!