BJP Graph Down : టిక్కెట్ ఇస్తాం..ప్లీజ్ రండి! బీజేపీ దీన‌క‌థ‌!

BJP Graph Down : తెలంగాణ బీజేపీ గ్రాఫ్ నానాటికీ ప‌డిపోతోంది. ఆ పార్టీ నుంచి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు క‌రువ‌య్యారు.

  • Written By:
  • Updated On - September 6, 2023 / 04:54 PM IST

BJP Graph Down : తెలంగాణ బీజేపీ గ్రాఫ్ నానాటికీ ప‌డిపోతోంది. ఆ పార్టీ నుంచి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు క‌రువ‌య్యారు. ప్లీజ్ రండి..పోటీ చేయండి అంటూ బీజేపీ అభ్య‌ర్థిస్తోంది. అభ్య‌ర్థిత్వాల కోసం ద‌ర‌ఖాస్తుల‌కు ఆ పార్టీ రెండు రోజుల క్రితం ఆహ్వానించింది. స్పంద‌న దాదాపుగా లేద‌ని చెప్పాలి. ఉచిత ద‌ర‌ఖాస్తు అవ‌కాశాన్ని ఇచ్చిన‌ప్ప‌టికీ సానుకూలంగా ముందుకు వ‌చ్చే లీడ‌ర్లు లేక‌పోవ‌డం విచిత్రం. ఆ పార్టీలోని సీనియ‌ర్లు సైతం పోటీ చేయ‌డానికి ఉత్సాహంగా ముందుకు రావ‌డంలేద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

ఉచిత ద‌ర‌ఖాస్తు ఇచ్చిన‌ప్ప‌టికీ లీడ‌ర్లు లేక‌పోవ‌డం విచిత్రం (BJP Graph Down)

గ‌త రెండేళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వ‌చ్చింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో 44 మంది కార్పొరేట‌ర్ల‌ను గెలుచుకుంది. ఉప ఎన్నిక‌ల్లో దుబ్బాక‌, హుజూరాబాద్ నుంచి గెలిచింది. ఎమ్మెల్సీ, మునుగోడు ఎన్నిక‌ల్లో రెండో ప్లేస్ లో నిలిచింది. ఇంకేముంది బీజేపీకి రాజ్యాధికారం తెలంగాణ‌లో ద‌గ్గ‌ర‌లోకి వ‌చ్చింద‌ని చాలా మంది భావించారు. ఆ పార్టీ దూకుడును గ‌మ‌నించిన వాళ్లు అధికారంలోకి వ‌చ్చిన‌ట్టే భావించారు. ఆ ఊపును చూసిన లీడ‌ర్లు ఇత‌ర పార్టీల నుంచి క‌మ‌ల‌తీర్థం పుచ్చుకోవ‌డానికి క్యూ క‌ట్టారు. అలాంటి వాళ్ల‌లో మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి, దాసోజు శ్రావ‌ణ్, కొండా విశ్వేశ్వ‌రరెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మ‌హీశ్వ‌ర‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఉన్నారు. సీన్ క‌ట్ చేస్తే, అదంతా బలుపు కాదు వాపు (BJP Graph Down) అని తేలింది.

గ‌త రెండేళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ

బీజేపీలోకి వెళ్లాల‌ని భావించిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు క‌మ‌లం క‌థ‌ను తెలుసుకున్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత సీన్ మారింది. అప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్ర‌త్యామ్నాయం అంటూ భావించిన వాళ్లు కాంగ్రెస్ వైపు మ‌ళ్లారు. దీనికి కార‌ణం క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ను కాంగ్రెస్ లీడ‌ర్లు భావిస్తుంటారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో మారిన ప‌రిస్థితులు, బీజేపీ అగ్ర నేత‌ల అవ‌స‌రాలు వెర‌సి క‌మ‌లం వాడిపోయింది. వాస్త‌వంగా ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ఎర కేసు నుంచి రాజ‌కీయం మ‌లుపు తిరిగింది. ఓటుకు నోటు కేసు తరువాత ఎలా అయితే, రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో మారిందో, అదే విధంగా ఇప్పుడు కూడా యూట‌ర్న్ (BJP Graph Down) తీసుకుంది.

బీజేపీకి సానుభూతిప‌రులుగా ఉన్న‌ స్వామీజీలు జైలు

మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ఎర కేసు బ‌య‌ట‌ప‌డింది. ఆ సంద‌ర్భంగా బీజేపీ పెద్ద‌లు, స్వామీజీలు దొరికిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప‌డేసిన ఎపిసోడ్ ల‌ను కేసీఆర్ ఒడిసి ప‌ట్టుకున్నారు. తెలంగాణ నిఘా వ‌ర్గాలు వేసిన వ‌ల‌కు బీజేపీకి సానుభూతిప‌రులుగా ఉన్న‌ స్వామీజీలు దొరికిపోయారు. వాళ్ల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం జైలుకు పంపింది. ఫాంహౌస్ ఎపిసోడ్ లో దొరికిన ఆధారాల‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేయ‌డానికి కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. వీడియో ఫుటేజ్ ను న్యాయ‌స్థానాలు, రాజ‌కీయ పార్టీల అధిప‌తులు, మీడియా హౌస్ ల‌కు పంపారు. ఆయ‌న వ్యూహాన్ని చూసిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు రాజీ మార్గాన్ని కేసీఆర్ తో ఎంచుకున్నారని (BJP Graph Down) వినికిడి.

ఫాంహౌస్ కేసు, ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ (BJP Graph Down)

ఫాంహౌస్ కేసు త‌రువాత ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దానిలో కేసీఆర్ కుమార్తె క‌విత పాత్ర ఉంద‌ని వీడియోల‌ను ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు (BJP Graph Down) బహిర్గ‌తం చేశారు. అమెను అరెస్ట్ చేస్తున్న‌ట్టు ప్ర‌చారం చేశారు. అంతేకాదు, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని బ‌జారున ప‌డేస్తామ‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికారు. ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా ప్ర‌క‌టించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ కూడా కేసీఆర్ ప్ర‌భుత్వం ఎంతో కాలం ఉండ‌ద‌ని సికింద్రాబాద్ స‌భ‌లో ప్ర‌స్తావించారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని అప్ప‌టి బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప్ర‌క‌టించారు. ఆ ఊపును చూసిన వాళ్లు బీజేపీ ఏదో చేస్తుంది? అని నమ్మారు. కేసీఆర్ ప్ర‌భుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయింద‌ని భావించారు.

Also Read : YCP Special status : BJPతో కాపురం, కాంగ్రెస్ తో ప్రేమాయ‌ణం!జ‌గ‌న్ ల‌క్ !!

మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన అక‌స్మాత్తుగా బీజేపీ దూకుడు త‌గ్గించింది. తెలంగాణ ప్ర‌భుత్వం మీద ఒంటికాలు మీద లేసే బండి సంజ‌య్ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఇంటికి వెళ్లారు. టీఎస్ పీఎస్సీ పేప‌ర్ లీకేజీ కేసు మీద కూడా పెద్ద‌గా బీజేపీ రియాక్ట్ కాలేదు. దూకుడుగా వెళుతోన్న బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి బండి సంజ‌య్ ను త‌ప్పించారు. ఆయ‌న బదులుగా కేసీఆర్ కు స‌న్నిహితంగా ఉండే కిష‌న్ రెడ్డిని నియమించారు. ఇవ‌న్నీ చూసిన త‌రువాత కేసీఆర్ అంతుచూడాల‌ని బీజేపీకి వెళ్లిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, ఈటెల రాజేంద్ర త‌దిత‌ర కీల‌క నేత‌లు కాంగ్రెస్ వైపు సంకేతాలు ఇచ్చారు. అప్ర‌మ‌త్తమైన బీజేపీ అధిష్టానం వాళ్లిద్ద‌రికీ ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ కంటితుడుపుగా ఖ‌మ్మం స‌భ‌ను ఇటీవ‌ల అమిత్ షా నిర్వ‌హించారు. కానీ, ఎక్క‌డా బీఆర్ఎస్ మీద వ్య‌తిరేక ప్ర‌చారం చేయ‌లేదు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి దుస్థితికి ప‌డిపోయిన బీజేపీ నుంచి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంలేదు.

Also Read : BJP Target : కేసీఆర్..కేటీఆర్ లను టార్గెట్ చేసిన బిజెపి..వారిపై బలమైన నేతలు బరిలోకి..?

క‌నీసం 35 స్థానాల్లో పోటీ చేయడానికి ఎవ‌రూ ముందుకు రాలేద‌ని తెలుస్తోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు స‌గం నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా ద‌ర‌ఖాస్తు అందించే లీడ‌ర్లు ఎవ‌రూ లేర‌ట‌. ఇత‌ర పార్టీల నుంచి ఎవ‌రొచ్చినా టిక్కెట్ ఇస్తామంటూ బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్నారు క‌మ‌ల‌నాథులు. తొమ్మిద‌న్న‌రేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణ‌లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థులు ముందుకు రాక‌పోవ‌డం విచిత్రం. అంతేకాదు, ప్ర‌స్తుతం ఆ పార్టీలో ఉన్న సీనియ‌ర్లు కూడా పోటీ చేయ‌డానికి ఉత్సాహం చూప‌డంలేదు. ఎన్నిక‌ల ఖ‌ర్చు నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. కేవ‌లం మూడు నెల‌ల్లో ఏ స్థాయి నుంచి ఏ దుస్థితికి బీజేపీ వ‌చ్చిందో  (BJP Graph Down) ఈ పరిణామం ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం.