జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల కమిషన్ (EC) ను ఆశ్రయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉపఎన్నిక సమయంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు చేస్తూ, అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు మీడియా రిపోర్టులు వచ్చాయని బీజేపీ పేర్కొంది. ఇది ఎన్నికల నియమావళి (Model Code of Conduct – MCC) ఉల్లంఘనగా స్పష్టమని, వెంటనే ఈ ప్రక్రియను ఆపివేయాలని ఈసీని కోరింది.
Bengaluru : బెంగళూరులో దారుణం.. యువకుడిని వెంటాడి కారుతో ఢీ
బీజేపీ ఫిర్యాదులో ముఖ్యంగా పేర్కొన్న అంశం ఏమిటంటే.. అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేళ, ఆయనకు మంత్రి పదవి హామీ ఇవ్వడం ఎన్నికల సమయంలో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నమని. ఇది నిష్పక్షపాత ఎన్నికల సూత్రాలకు వ్యతిరేకమని బీజేపీ వాదిస్తోంది. ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ చర్యతో ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమైన ఉదాహరణ సృష్టించారని ఆరోపించింది. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది.
ఇక ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వర్గాలు అయితే ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాయి. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవని, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొంటున్నాయి. మరోవైపు, బీజేపీ నేతలు మాత్రం “ఎన్నికల నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సీఎం అయినా, అభ్యర్థి అయినా ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవు” అని హెచ్చరిస్తున్నారు. ఈసీ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
