BJP CM : తెలంగాణ బీజేపీ సార‌థి బండి! 12న అమిత్ షా బ‌హిరంగ స‌భ‌

తెలంగాణలో రాజ్యాధికారానికి బీజేపీ అడుగులు వేస్తోంది. రాబోవు ఎన్నిక‌ల ర‌థ‌సార‌థిగా(BJP CM)

  • Written By:
  • Publish Date - February 24, 2023 / 05:03 PM IST

తెలంగాణలో రాజ్యాధికారానికి బీజేపీ వేగంగా అడుగులు వేస్తోంది. రాబోవు ఎన్నిక‌ల ర‌థ‌సార‌థిగా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ (BJP CM) ఉంటార‌ని బీజేపీ ఇంచార్జి త‌రుణ్ చుక్ ప్ర‌క‌టించారు. అంటే, కాబోయే సీఎంగా ఆయ‌న్ను ప్ర‌మోట్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. వెనుక‌బ‌డిన వ‌ర్గాల కార్డ్ ను(BC Card) బీజేపీ ప్లే చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీలోని పలువురు సీనియ‌ర్లు సంజ‌య్ మీద వ్య‌తిరేకంగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను సార‌థిగా ప్ర‌క‌టించ‌డం బీసీ ఓట‌ర్ల‌కు గాలం వేయ‌డ‌మే. రాష్ట్రంలో రాజ్యాధికారం దిశ‌గా అమిత్ షా, మోడీ ద్వ‌యం ఏడాది క్రితం నుంచి పావులు క‌దుపుతోంది.

ఎన్నిక‌ల ర‌థ‌సార‌థి బీజేపీ చీఫ్ బండి సంజ‌య్  (BJP CM)

సికింద్రాబాద్ కేంద్రంగా జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు అనూహ్యంగా విజ‌య‌వంతం అయ్యాయి. ఆ రోజు నుంచి సంజ‌య్ ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల కంట్లో ప‌డ్డారు. ఆ క్ర‌మంలో ఆయ‌న్ను ర‌థ‌సార‌థిగా (BJP CM) ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు అండ‌గా నిల‌వ‌డానికి బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు క్యూ క‌డుతున్నారు.తాజాగా అమిత్ షా మ‌రోసారి తెలంగాణ ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేసుకున్నారు మార్చి 12వ తేదీన ఆయ‌న రాష్ట్రానికి రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వరుస కార్యక్రమాలతో ఇప్పటికే బిజీ బిజీగా ఉంది. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా షా హైదరాబాద్ కు వస్తున్నట్లు బీజేపీ నేతలు ప్ర‌క‌టించారు. అయితే, అదే రోజు రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అధికారిక కార్యక్రమం తర్వాత రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ నేతలతో షా సమావేశం అవుతారని తెలుస్తోంది.

Also Read : BJP Challenges AIMIM: ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం.. MIMకు ‘బండి’ ఛాలెంజ్!

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అమిత్ షా పర్యటన ఉంటుంద‌ని బీజేపీ రాష్ట్ర వర్గాల్లోని టాక్‌. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసింది. దీనికి మంచి స్పందనే వస్తుంది. మార్చి 12న నియోజకవర్గాల్లోని పార్టీ నేతలతో అమిత్ షా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో అమలుచేసే వ్యూహాల గురించి చర్చిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

మార్చి 12వ తేదీన అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న

వాస్త‌వంగా బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ఉండాల‌ని కిష‌న్ రెడ్డి ఉండాలని ఆయ‌న వ‌ర్గీయులు భావిస్తున్నారు. పైగా ఆయ‌న రెండుసార్లు ఉమ్మ‌డి ఏపీ బీజేపీ అధ్య‌క్షునిగా ప‌నిచేశారు. రాజ‌కీయ అనుభ‌వం ఉన్న లీడ‌ర్. తెలంగాణ రాష్ట్రంలో బ‌ల‌మైన రెడ్డి సామాజిక‌వ‌ర్గంకు చెందిన రాజ‌కీయ‌వేత్త‌. ఆయ‌నకు సీఎం ప‌ద‌వి కావాల‌ని ఆ వ‌ర్గం కోరుకుంటోంది. కానీ, మోడీ, షా ద్వ‌యం వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన సంజ‌య్ ను సీఎం చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకే ఆయ‌న్ను 2024 ర‌థసార‌థిగా (BJP CM) ప్ర‌క‌టించారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లోనూ బీసీల‌కు(BC Card) కేటాయింపులు చాలా స్వ‌ల్పంగా చేశారు. దాన్ని అస్త్రంగా చేసుకుని తెలంగాణాలో రాజ్యాధికారం కోసం బీజేపీ బలంగా వెళ్లే అవ‌కాశం ఉంది.

Also Read : BJP Ridings: ప్రాంతీయ పార్టీలపై బీజేపీ సవారీ! కేసీఆర్ జాతీయ కుప్పిగంతులు