MIM Party : మజ్లిస్‌కు ఎదురుగాలి.. ఆ రెండు స్థానాల్లో బీజేపీ లీడ్

MIM Party : హైదరాబాద్‌లో మజ్లిస్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది.

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 12:52 PM IST

MIM Party : హైదరాబాద్‌లో మజ్లిస్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి హైదరాబాద్‌ పరిధిలోని కీలకమైన 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఎంఐఎం అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఓల్డ్ సిటీలో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. మజ్లిస్ పార్టీకి ఏడు నుంచి ఎనిమిది అసెంబ్లీ సీట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే బీజేపీ టఫ్ ఫైట్ నేపథ్యంలో ఓల్డ్ సిటీ పరిధిలోని స్థానాల్లో ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కార్వాన్, యాకుత్ పురా పరిధిలో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పెద్దసంఖ్యలోనే ఓట్లను చీలుస్తున్నారు.  ఈ పరిణామం బీజేపీ అభ్యర్థులకు కలిసొస్తోంది. దీంతో మజ్లిస్ అభ్యర్థులు ముందంజలోకి రాలేకపోతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని 7 అసెంబ్లీ సీట్లను దాదాపు రెండు దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న మజ్లిస్‌కు ఈసారి ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి చెందిన 8 మంది అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మునుపటి కంటే ఈసారి బీజేపీ బలపడిందని తేటతెల్లం అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

మజ్లిస్ సిట్టింగ్ స్ధానం కార్వాన్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మెహియుద్దీన్ వెనుకంజలో ఉండిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్ధి అమర్ సింగ్ లీడ్‌లో కొనసాగుతున్నారు. యాకుత్ పురా నుంచి బరిలోకి దిగిన ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్ధి వీరంద్ర బాబూ యాదవ్ లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ ఎంబీటీ అభ్యర్ధి అంజాదుల్లా ఖాన్.. వీరిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు. ఎంఐఎం మరో సిట్టింగ్ స్ధానం నాంపల్లిలో హైదరాబాద్ మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ స్వల్పంగా వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి ఫిరోజ్ ఖాన్ ఆధిక్యంలో(MIM Party) సాగుతున్నారు.

Also Read: Revanth Reddy : రేవంత్ ఇంటికి డీకే శివకుమార్.. డీజీపీ అంజనీకుమార్ !